హాంగ్జూ: ఆసియా క్రీడల్లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 23 రన్స్ తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో జైస్వాల్ సెంచరీ చేశాడు. కానీ రింకూ సింగ్(Rinku Singh) కూడా తన హిట్టింగ్ ట్యాలెంట్‌తో ఆకట్టుకున్నాడు. ఆరో స్థానంలో వచ్చిన రింకూ.. కేవలం 15 బంతుల్లో 37 రన్స్ చేశాడు. దాంట్లో రెండు బౌండరీలు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. నేపాల్ బౌలర్లు అభినాశ్ బోహరా, రోహిత్ పౌడెల్‌ను ఉతికారేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో రింకూ తన పవర్ హిట్టింగ్తో కేక పుట్టించాడు. ఆ ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. రింకూ పవర్ గేమ్‌కు చెందిన వీడియో ఇదే చూడండి.
.@rinkusingh235 was the King towards the end 🫡🔥
A special and yet another impressive knock from the southpaw put us all in awe 😯🏏#SonySportsNetwork #Cheer4India #Hangzhou2022 #IssBaar100Paar #Cricket #RinkuSingh #TeamIndia | @Media_SAI pic.twitter.com/WwDprgI6jb
— Sony Sports Network (@SonySportsNetwk) October 3, 2023