Rinku Singh : ఐపీఎల్‌తో ఓవర్ నైట్ స్టార్ అయిన రింకూ సింగ్ (Rinku Singh) ఎంపీతో నిశ్చితార్ధం తర్వాత తరచూ నెట్టింట వైరలవుతున్నాడు. ఫ్యాన్ పేజీలో ఫొటోలు చూసి ప్రియా సరోజ్ (Priya Saroj) తనతో ప్రేమలో పడిందని వెల్లడించిన రింకూ.. మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఏడాది క్రితం టీ20 వరల్డ్ కప్ ప్రధాన స్క్వాడ్‌లో చోటు దక్కకపోవడంతో ఎంతో బాధపడ్డానని చెప్పాడీ చిచ్చరపిడుగు. అయితే.. రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైన తనను బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ (Shah Rukh Khan)ప్రత్యేక విమానంలో తీసుకెళ్లాడని రింకూ వెల్లడించాడు.
‘పొట్టి ప్రపంచ కప్‌లో స్క్వాడ్‌లో నేను లేను. కానీ, రిజర్వ్ ప్లేయర్‌గా తీసుకున్నారు. అప్పటికే టీమ్ అమెరికా వెళ్లింది. మరుసటి రోజు నేను వీసా దరఖాస్తు పనుల్లో ఉన్నాను. సరిగ్గా అదే రోజు షారుక్ ఖాన్ సైతం యూఎస్ఏ వెళ్లాలనుకున్నారట. అప్పటికే నేను ఫ్లయిట్ బుక్ చేసుకున్నా. ఒంటరిగానే వెళ్లేందుకు సిద్ధమయ్యాను. కానీ.. ఈ విషయం షారుక్ సర్‌కు తెలిసి తనతో పాటు రావాల్సిందిగా కబురు పంపారు. నేను సూపర్ స్టార్‌తో ఒంటిరిగా ప్రత్యేక విమానంలో వెళ్లడం ఏంటీ? ..
🚨 Rinku Singh Exclusive
Rinku Singh recalls travelling on a chartered flight with Shah Rukh Khan, where SRK’s warmth and humility left him speechless.
Full Episode airs at 12 noon. Stay Tuned.@rohitjuglan @rinkusingh235 @iamsrk @AgeasFederal @KKRiders #KKR #ShahRukhKhan… pic.twitter.com/RJwXzDAEnw
— RevSportz Global (@RevSportzGlobal) August 23, 2025
ఇదంతా కలా? నిజమా? అని కాసింత ఒత్తిడికి లోనయ్యాను. ఆయనతో ఎలా ప్రవర్తించాలి? అసలు వెళ్లకపోవడమే మంచిది? ఇలా నాలో అనేక సందేహాలు. చివరకు.. బాద్ షాతో కలిసి ఫ్లయిట్ జర్నీకి సిద్ధమయ్యాను. కారులో వెళ్తుండగా షారుక్ నన్ను ఎంతో ప్రోత్సహించారు. 17వ సీజన్లో కోల్‌కతా యాజమాన్యం నాపై పెట్టుకున్న అంచనాలు నిలబెట్టుకోలేకపోయాను. అయినా సరే.. షారుక్ చాలా పాజిటివ్ విషయాలు చెబుతూ నాలో స్ఫూర్తి నింపాడు. ఆ తర్వాత విమానంలోనూ ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆ రెండు గంటల జర్నీని నేను మర్చిపోలేను అని రింకూ రెవ్ స్పోర్ట్స్‌తో వెల్లడించాడు.
ఐపీఎల్ 2023 ఎడిషన్‌లో రింకూ సింగ్ పేరు మార్మోగిపోయింది. గుజరాత్ టైటాన్స్ పేసర్ యశ్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా తొలి ఐదు బంతుల్ని సిక్సర్లుగా మలిచిన ఈ హిట్టర్ కోల్‌కతాకు చిరస్మరణీయ విక్టరీ అందించాడు. ఆ ఏడాది 14 మ్యాచుల్లో రింకూ నాలుగు హాఫ్ సెంచరీలు, 59.25 సగటుతో 474 రన్స్ బాదాడు. ఆ సీజన్లో సుడిగాలి ఇన్నింగ్స్‌లతో బౌలర్లకు దడ పుట్టించిన ఈ లెఫ్ట్ హ్యాండర్‌ను కోల్‌కతా రూ.13 కోట్లకు అట్టిపెట్టుకుంది.
Rinku Singh, 28 need in just 5 ball ,hits 5 sixes win & become famous .रिंकू सिंह #rinkusingh pic.twitter.com/qB5b1HHfix
— Ramanand 🐦 (@Ramanand06) June 8, 2025
అయితే.. 17, 18వ సీజన్లలో రింకూ గొప్ప ప్రదర్శన చేయలేదు. అయినా సరే పొట్టి ఫార్మాట్లో విధ్వంసక ఆటకు కేరాఫ్ అయిన అతడు ఆసియా కప్ స్క్వాడ్‌లో చోటుదక్కించుకున్నాడు. యూఏఈ గడ్డపై సెప్టెంబర్ 30 నుంచి మొదలయ్యే ఈ మెగా టోర్నీలో రింకూకు అవకాశం వస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.