అలీగఢ్: టీమ్ఇండియా యువ సంచలనం, ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఆడే రింకూ సింగ్ కొత్త ఇంటికి మారాడు. అలీగఢ్‌లోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిపెరిగిన రింకూ స్థానికంగా ఉన్న గోల్డెన్ ఎస్టేట్‌లోని ఓజోన్ టౌన్షిప్లో రూ. 3.5 కోట్ల విలువ చేసే బంగ్లాను కొనుగోలు చేశాడు.
500 స్కేర్ యార్డ్స్ విస్తీర్ణంలో నిర్మించిన ఈ బంగ్లాను రింకూ గత వారమే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్లో కేకేఆర్.. రింకూను ఏకంగా రూ. 13 కోట్లతో టాప్-1 రిటెన్షన్‌గా అట్టిపెట్టుకున్న విషయం తెలిసిందే. గతంలో రింకూ తండ్రి స్థానికంగా ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేయగా అతడి సోదరుడు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు.