IPL 2023 : ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ నితీశ్ రానా(52) అర్ధ శతకంతో చెలరేగగా.. ఆండ్రూ రస్సెల్(42) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి బంతికి రింకూ సింగ్(21నాటౌట్) ఫోర్ కొట్టడంతో కోల్‌కతా అనూహ్యంగా గెలిచింది. వరుసగా రెండో విజయంతో పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి ఎగబాకింది. ప్లే ఆఫ్ రేసుకు పోటీదారుగా మారింది.
అర్ష్‌దీప్ సింగ్ వేసిన 20వ ఓవర్లో కోల్‌కతా విజయానికి 6 బంతుల్లో 6 పరుగులు కావాలి. తొలి మూడు బంతుల్లో రెండు పరుగులే వచ్చాయి. నాలుగో బాల్‌కు ఆండ్రూ రస్సెల్(42) రెండు రన్స్ తీశాడు. ఐదో బాల్‌కు రనౌటయ్యాడు. దాంతో, ఆఖరి బంతికి రెండు రన్స్ అవసరమ్యాయి. ఆఖరి బాల్‌కు రింకూ సింగ్(16) ఫోర్ కొట్టాడు. దాంతో కోల్‌కతా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(15)ను ఇంపాక్ట్ ప్లేయర్ నాథన్ ఎల్లిస్ ఎల్బీగా ఔట్ చేశాడు. డేంజరస్ జేసన్ రాయ్(38)ను హర్‌ప్రీత్ బ్రార్ వెనక్కి పంపాడు. వెంకటేశ్ అయ్యర్(10) విఫలమయ్యాడు. నితీశ్ రానా(52) అర్ధ శతకంతో ఆదుకున్నాడు. ఆఖర్లో ఆండ్రూ రస్సెల్(42), రింకూ సింగ్(21) చివరి దాకా పోరాడి గెలిపించారు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఓపెనర్ శిఖర్ ధావన్(57 47 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆఖర్లో హర్‌ప్రీత్ బ్రార్(12), రెండు షారుక్ ఖాన్(6) ధనాధన్ ఆడారు. దాంతో పంజాబ్ స్కోర్ చేయగలిగింది. టాస్ గెలిచిన పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్(12), భానుక రాజపక్సే(0)ను వరుస ఓవర్లలో హర్షిత్ రానా పెవిలియన్ పంపాడు. పవర్ ప్లేలో దంచి కొట్టిన విధ్వసంక ఆటగాడు లివింగ్‌స్టోన్(15), జితేశ్ శర్మ(21), రిషి ధావన్(19)లను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు. ఆఖర్లో హర్‌ప్రీత్ బ్రార్(12), రెండు షారుక్ ఖాన్(6) ధనాధన్ ఆడి పంజాబ్‌కు పోరాడగలిగే స్కోర్ అందించారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు, హర్షిత్ రానా రెండు, నితీశ్ రానా ఒక వికెట్ తీశారు.