ఢిల్లీ: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత పారా అథ్లెట్ల పతక వేట కొనసాగుతున్నది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 ఈవెంట్లో రింకూ హుడా, సుందర్ సింగ్ గుర్జార్ వరుసగా స్వర్ణ, రజతాలు కైవసం చేసుకున్నారు.
రింకూ 61.89 మీటర్ల రికార్డు త్రో తో పసిడి సాధించగా సుందర్ 64.11 మీటర్లతో రజతం కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే ఐదు పతకాలు గెలిచింది.