IND vs AUS : వరల్డ్ కప్‌లో టీమిండియా ఆఖరి సూపర్ 8 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దాంతో, ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికేస్తున్న రోహిత్ శర్మ (41) జోరుకు బ్రేక్ పడింది. భారత ఇన్నింగ్స్ 4.1 ఓవర్ వద్ద వాన మొదలైంది. దాంతో, గ్రౌండ్ సిబ్బంది పరుగున వచ్చి పిచ్‌ను ప్లాస్టిక్ కవర్లతో కప్పేశారు. అప్పటకీ భారత్ స్కోర్.. 43/1.
వరల్డ్ కప్‌లో ఓపెనర్‌గా విఫలమవుతున్న విరాట్ కోహ్లీ(0) మళ్లీ నిరాశపరిచాడు. ఐదు బంతులు ఎదుర్కొన్న విరాట్.. హేజిల్‌వుడ్ ఓవర్లో భారీ షాట్ ఆడాడు. ఆ బంతిని టిమ్ డేవిడ్ అద్భుతంగా అందుకున్నాడు. దాంతో, మరోసారి సున్నాకే కోహ్లీ వెనుదిరిగాడు. ఆ తర్వాత మిచెల్ స్టార్క్ వేసిన ఓవర్లో రోహిత్ రెచ్చిపోయాడు. వరుసగా.. 6, 6, 4, 6, బాది స్కోర్ బోర్డును ఉరికించాడు. మరో ఎండ్‌లో రిషభ్ పంత్ (1) ఆడుతున్నాడు. వీళ్లిద్దరూ 10 ఓవర్ల వరకూ నిలబడితే భారత్ భారీ స్కోర్ చేయడం ఖాయం.