Rey Mysterio : ప్రపంచ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ (WWE – World Wrestling Entertainment) రెజ్లర్ అయిన రే మిస్టీరియో సీనియర్ (Rey Misterio Senior) మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న 66 ఏళ్ల రే మిస్టీరియో పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. దాంతో ఆయన అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
రే మిస్టీరియో దాదాపు 30 ఏళ్లపాటు రెజ్లింగ్‌లో రాణించారు. 1976లో వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో అడుగు పెట్టిన రే మిస్టీరియో.. 2009లో రెజ్లింగ్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. సుదీర్ఘకాలం తన ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించాడు. ఆయన మరణంపట్ల చాలామంది సంతాపం తెలుపుతున్నారు. కాగా రే మిస్టీరియో iwc వరల్డ్ మిడ్ వెయిట్ ఛాంపియన్‌షిప్‌ను రెండుసార్లు గెలిచాడు.
ఇటీవల ఈ స్టార్ రెజ్లర్ రే మిస్టీరియో తండ్రి రాబర్ట్ కూడా మరణించాడు. ఆయన మరణం నుంచి ఆ కుటుంబం ఇంకా తేరుకోకముందే ఆ ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. రే మిస్టీరియో బాగా బరువు తగ్గడంతో ఆస్పత్రి పాలయ్యారట. ఈ తరుణంలోనే ఆయన చికిత్స పొందుతూ మరణించారు. రే మిస్టీరియో అసలు పేరు మిగ్యూల్ ఏంజెల్ లోపేజ్ డియాస్. రే మిస్టీరియో కొడుకు ప్రస్తుతం రెజ్లింగ్‌లోనే ఉన్నాడు.
తండ్రి వారసత్వంలో జూనియర్ రే మిస్టీరియో కూడా రెజ్లింగ్‌లో దుమ్ము లేపుతున్నాడు. సీనియర్ రే మిస్టీరియో సోమవారం జరగనున్నట్లు సమాచారం.