చండీఘడ్: గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇవాళ న్యూ చండీఘడ్ పీసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐపీఎల్ క్వాలిఫయర్2(IPL Qualifier 2) మ్యాచ్ జరనున్నది. ఆ మ్యాచ్ రాత్రి ఏడున్నరకు ప్రారంభంకానున్నది. అయితే చండీఘడ్‌లో శుక్రవారం రాత్రి వర్షం పడే ఛాన్సు ఉన్నది. ఈ నేపథ్యంలో భారతీయ వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల మధ్య .. చండీఘడ్‌లో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఉదయం చండీఘడ్ ట్రైసిటీ ప్రస్తుతం చాలా నిర్మలంగా ఉన్నది. సాయంత్రం వరకు వర్షం పడే అవకాశాలు లేవు. కానీ ఇప్పటికే హర్యానాలో చాలా ప్రాంతాల్లో వర్షం పడింది. సాయంత్రం 4 నుంచి 9 వరకు వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ క్వాలిఫయర్2 మ్యాచ్‌పై సందిగ్ధత నెలకొన్నది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే అప్పుడు ఐపీఎల్ ఫైనల్లోకి గుజరాత్ టైటాన్స్ ప్రవేశిస్తుంది. నెట్ రన్‌రేట్ ఆధారంగా ఆ ఫలితం తేలనున్నది. ఇక ఆదివారం అహ్మదాబాద్ స్టేడియంలో ఆర్సీబీతో ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే.