న్యూఢిల్లీ: ఇండియాకు 121 ఏళ్ల తర్వాత అథ్లెటిక్స్‌లో తొలి గోల్డ్ మెడల్ సాధించిపెట్టాడని నీరజ్ చోప్రా( Neeraj Chopra )ను ఆకాశానికెత్తుతున్నాం. కానీ ఈ అథ్లెటిక్స్ మెడల్ కలను 37 ఏళ్ల కిందటే సాకారం చేయడానికి ప్రయత్నించి తృటిలో మిస్పయింది స్ప్రింటర్ పీటీ ఉష. 1984 గేమ్స్‌లో ఆమె 400 మీటర్ల హర్డిల్స్‌లో నాలుగోస్థానంలో నిలిచి మెడల్ చాన్స్‌ను కోల్పోయింది. అయితే మొత్తానికి ఇప్పుడు అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి మెడల్ సాధించి పెట్టిన నీరజ్ చోప్రాను చూసి పీటీ ఉష చాలా సంబరపడిపోతోంది.
నీరజ్ గోల్డ్ గెలవగానే ఆమె ఓ ట్వీట్ చేసింది. 37 ఏళ్ల కిందట నెరవేరకుండా ఉండిపోయిన నా కల ఇప్పుడు నెరవేరింది. థ్యాంక్యూ మై సన్ నీరజ్ చోప్రా అని ఉష ట్వీట్ చేయడం విశేషం. నిజానికి 1984 గేమ్స్‌కు ముందు ఉష టాప్ ఫామ్‌లో ఉంది. 1982లో ఏషియన్ గేమ్స్‌లో 100, 200 మీటర్ల స్ప్రింట్‌లో సిల్వర్ మెడల్స్ గెలిచింది. తర్వాతి ఏడాది ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో 400 మీటర్లలో ఏకంగా గోల్డ్ సాధించింది. ఆ తర్వాత 400 మీటర్ల హర్డిల్స్‌పై దృష్టి సారించి 1984 గేమ్స్‌లో మెడల్‌పై ఆశలు రేపింది.
Realised my unfinished dream today after 37 years. Thank you my son @Neeraj_chopra1 🇮🇳🥇#Tokyo2020 pic.twitter.com/CeDBYK9kO9
— P.T. USHA (@PTUshaOfficial) August 7, 2021