పర్వతగిరి, నవంబర్ 17: హైదరాబాద్ శివారులోని కొల్లూరులో ఈ నెల 16న నిర్వహించిన జూనియర్ స్టేట్ ఆర్చరీ మీట్లో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ ఆర్డీఎఫ్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి జూనియర్ నేషనల్స్‌కు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆడెపు జనార్దన్ సోమవారం తెలిపారు.
ఈ మీట్లో రికర్వ్ విభాగం, ఇండియన్ రౌండ్లలో కోచ్ బండారి భరత్ పర్యవేక్షణలో శిక్షణ పొందిన గంగరాజు, త్రిషూల్, పి. వినయ్, బి. ఆశ్విత్, బి. మానస పతకాలు సాధించినట్లు తెలిపారు. వీరు త్వరలో రాయపూర్‌లో జరగబోయే జూనియర్ నేషనల్స్‌లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నట్లు పేర్కొన్నారు.