బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ సారధి కేన్ విలియమ్సన్ (0) ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్ చేరాడు. మ్యాక్స్వెల్ వేసిన తొలి ఓవర్ తొలి బంతిని కవర్స్ దిశగా పంపిన అభిషేక్.. సింగిల్ కోసం పరుగుు తీశాడు. అయితే బంతిని అందుకున్న షాబాజ్ అహ్మద్ కీపర్ ఎండ్లో ఉన్న వికెట్స్కు డైరెక్ట్ త్రో వేశాడు. దాంతో విలియమ్సన్ అవుటయ్యాడు. బంతి వికెట్లను కూల్చే సమయానికి విలియమ్సన్ బ్యాటు.. సరిగ్గా క్రీజు గీతపైనే ఉందని థర్డ్ అంపైర్ భావించాడు. దీంతో ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే విలియమ్సన్ మైదానం వీడాడు.
అదే ఓవర్ ఐదో బంతికి ఫామ్లో ఉన్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (0) కూడా డకౌట్ అయ్యాడు. మ్యాక్స్ వెల్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన అతను పుల్ చేయబోయాడు. అయితే బంతి అతను అనుకున్నంత ఎత్తుగా రాలేదు. దాంతో బంతిని పూర్తిగా మిస్ అయ్యాడు. అది వెళ్లి వికెట్లను నేరుగా కూల్చడంతో అభిషేక్ నిరాశగా పెవిలియన్ చేరాడు.