బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమి అంచుల్లో నిలిచింది. ఆ జట్టును గెలిపించడానికి ఒంటరి పోరాటం చేస్తున్న రాహుల్ త్రిపాఠీ (58) కూడా పెవిలియన్ చేరాడు. హాజిల్‌వుడ్ వేసిన 15వ ఓవర్లో త్రిపాఠీ అవుటయ్యాడు. లెంగ్త్ డెలివరీని ఫీల్డర్ మీద నుంచి పంపేందుకు త్రిపాఠీ ప్రయత్నించాడు.
కానీ కనెక్షన్ సరిగా లేకపోవడంతో లోమ్రోర్‌కు సులభమైన క్యాచ్ లభించింది. దీంతో 114 పరుగుల వద్ద సన్‌రైజర్స్ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. ఆ జట్టు గెలవాలంటే 26 బంతుల్లో ఇంకా 79 పరుగులు చేయాల్సి ఉంది.