రాయల్ ఛాలెంజ్స్ బెంగళూరుతో తలపడేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ రెడీ అయింది. ఈ రెండు జట్ల మధ్య బ్రబోర్న్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతోంది. బెంగళూరు వరుసగా రెండు విజయాలతో సత్తా చాటగా.. సన్‌రైజర్స్ వరుసగా నాలుగు విజయాలతో జోరు మీద ఉన్నది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. సన్‌రైజర్స్ సారధి కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: అనూజ్ రావత్, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, సూయష్ ప్రభుదేశాయి, దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, వానిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హాజిల్‌వుడ్, మహమ్మద్ సిరాజ్
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, షషాంక్ సింగ్, జగదీష్ సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్