బెంగళూరు జట్టుకు షాకింగ్ ఆరంభం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు దిమ్మతిరిగే ఓపెనింగ్ లభించింది. రెండో ఓవర్లో బంతి అందుకున్న మార్కో జాన్సెన్.. ఆ జట్టును దెబ్బతీశాడు. ఆ ఓవర్ రెండో బంతికే కెప్టెన్ డుప్లెసిస్ (5)ను క్లీన్‌బౌల్డ్ చేసిన జాన్సెన్.. తర్వాతి బంతికే కోహ్లీని డక్ అవుట్ చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్లో కోహ్లీకి ఇది వరుసగా రెండో గోల్డెన్ డక్ కావడం గమనార్హం.
గత మ్యాచ్‌లో కూడా ఇదే పద్దతిలో స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చిన కోహ్లీ పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో కూడా కోహ్లీ ఆఫ్‌సైడ్ బంతిని ఆడేందుకు ప్రయత్నించి స్లిప్స్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అదే ఓవర్ చివరి బంతికి యువ ఓపెనర్ అనూజ్ రావత్ (0)ను కూడా జాన్సెన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో బెంగళూరు జట్టు 8 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.