బెంగళూరు: ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్.. ఆర్సీబీ టీమ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌కు కూడా డూప్లెసిస్‌కు బదులుగా విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టీమ్ ఆకుపచ్చ జెర్సీతో బరిలో దిగనుంది.
గ్రీన్ గేమ్ కాన్సెప్ట్‌తో 2011 నుంచి ప్రతి సీజన్లో సొంత గడ్డపై ఆడే ఒక మ్యాచ్ ఆకుపచ్చ జెర్సీతో ఆడటం ఆర్సీబీకి ఆనవాయితీగా వస్తున్నది. క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్పై అవగాహన కల్పించే లక్ష్యంతో ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ సీజన్లో ఆర్సీబీ, ఆర్ఆర్ జట్లు ఆరేసి మ్యాచ్‌లు ఆడాయి. ఆర్ఆర్ నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. ఆర్సీబీ మూడు విజయాలు, మూడు పరాజయాలతో ఆరో స్థానంలో ఉన్నది. ఇవాళ్టి మ్యాచ్‌కు సంబంధించిన అప్డేట్స్ మీ కోసం..
పదహారో సీజన్ ఐపీఎల్లో మరో హారాహోరు పోరు అభిమానులను అలరించింది. సొంత గ్రౌండ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గర్జించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో కోహ్లీ సేన టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. బౌలర్లు విజృంభించడంతో రాజస్థాన్‌పై 7 పరుగుల తేడాతో గెలిచింది. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(62), గ్లెన్ మ్యాక్స్‌వెల్(77) అర్థ శతకంతో చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత సంజూ శాంసన్ బృందాన్ని 182 పరుగులకే కట్టడి చేసింది. దాంతో,
హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి 20 పరుగులు అవసరమయ్యాయి. మొదటి బంతికి అశ్విన్(12) బౌండరీ కొట్టాడు. రెండో బతికి రెండు రస్ వచ్చాయి. మూడో బంతికి ఫోర్. నాలుగో బంతికి అశ్విన్ క్యాచ్ ఔటయ్యాడు. ఐదో బంతికి సింగిల్ వచ్చింది. ఆఖరి బంతికి 9 రన్స్ కావాలి. ధ్రువ్ జురెల్(33) సింగిల్ తీశాడు. దాంతో ఆర్సీబీ 7 పరుగుల తేడాతో గెలుపొందింది.
లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. విధ్వంసక ఓపెనర్ జోస్ బట్లర్(0)ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(47) , దేవ్‌దత్ పడిక్కల్(52) రెండో వికెట్‌కు 99 పరుగులు చేశారు. హర్షల్ పటేల్ స్లోవర్ డెలివరీతో యశస్వీని బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత సంజూ శాంసన్(22) ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. షిమ్రన్ హెట్మెయిర్(3) విఫలమయ్యాడు. ధ్రువ్ జురెల్(33), అశ్విన్() ధనాధన్ ఆడినా జట్టును గెలిపించలేకపోయారు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. సిరాజ్, డేవిడ్ విల్లేకు ఒక్కో వికెట్ దక్కింది.
రాజస్థాన్ మరింత కష్టాల్లో పడింది. షిమ్రన్ హెట్మెయిర్(3) రనౌటయ్యాడు. సుయాష్ ప్రభుదేశాయ్ డైరెక్ట్ త్రోకు అతను వెనుదిరిగాడు.
సిరాజ్ బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్(12) రెండు ఫోర్లు కొట్టాడు. షిమ్రన్ హెట్మెయిర్(3), ఆడుతున్నాడు. 17 ఓవర్లకు స్కోర్.. 145/3. రాజస్థాన్ విజయానికి 18బంతుల్లో 45 రన్స్ కావాలి.
హర్షల్ పటేల్ బిగ్ వికెట్ తీశాడు. సంజూ శాంసన్(22)ను ఔట్ చేశాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో షహబాజ్ అహ్మద్ క్యాచ్ పట్టడంతో రాజస్థాన్ ఐదో వికెట్ కోల్పోయింది.
కెప్టెన్ సంజూ శాంసన్(18) దంచుతున్నాడు. హసరంగ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్ కొట్టాడు. షిమ్రన్ హెట్మెయిర్(1) ఆడుతున్నాడు. 15 ఓవర్లకు స్కోర్.. 121/3. రాజస్థాన్ విజయానికి 30 బంతుల్లో 69 రన్స్ కావాలి.
రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్న ఓపెనర్ యశస్వీ జైస్వాల్(47) ఔటయ్యాడు. హర్షల్ పటేల్ ఓవర్లో కోహ్లీ క్యాచ్ పట్టడంతో అతను పెవిలియన్ బాట పట్టాడు. కెప్టెన్ సంజూ శాంసన్(7) ఆడుతున్నాడు. 13.4 ఓవర్లకు స్కోర్.. 108/3.
Momentum back with @RCBTweets!
The well-set Yashasvi Jaiswal walks back after scoring 47 👏🏻
It's @HarshalPatel23 with the wicket & once again @imVkohli with the catch 😎
Follow the match ▶️ https://t.co/lHmH28JwFm#TATAIPL | #RCBvRR pic.twitter.com/MHD84jsJae
— IndianPremierLeague (@IPL) April 23, 2023
హాఫ్ సెంచరీ కొట్టిన దేవ్‌దత్ పడిక్కల్(52) ఔటయ్యాడు. డేవిడ్ విల్లే బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సంజూ శాంసన్ క్రీజులోకి వచ్చాడు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(46) ఆడుతున్నాడు.11.4 ఓవర్లకు స్కోర్.. 99/2.
5⃣0⃣ & going strong!
That's a well-deserved half-century for @devdpd07 🙌🏻
Follow the match ▶️ https://t.co/lHmH28JwFm#TATAIPL | #RCBvRR pic.twitter.com/YOVM5EXM7S
— IndianPremierLeague (@IPL) April 23, 2023
వనిందు హసరంగ ఓవర్లో ఆఖరి బంతికి దేవ్‌దత్ పడిక్కల్(39) ఫోర్ బాదాడు.ఓపెనర్ యశస్వీ జైస్వాల్(42) క్రీజులో ఉన్నాడు. 9 ఓవర్లకు స్కోర్.. 81/1.
హర్షల్ పటేల్ ఓవర్లో మొదటి బంతికి దేవ్‌దత్ పడిక్కల్(29) సిక్స్ బాదాడు. దాంతో, రాజస్థాన్ స్కోర్ 50 దాటింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(28) క్రీజులో ఉన్నాడు. ఏడు ఓవర్లకు స్కోర్.. 57/1.
రాజస్థాన్ బ్యాటర్లు దంచుతున్నారు. మ్యాక్స్‌వెల్ ఓవర్లో మొదటి బంతికి దేవ్‌దత్ పడిక్కల్(21) ఫోర్ బాదాడు. మూడో బంతికి లాంగాన్‌లో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(26) భారీ సిక్స్ కొట్టాడు. దాంతో, 11 రన్స్ వచ్చాయి. పవర్ ప్లేలో స్కోర్.. 47/1.
End of Powerplay!@ybj_19 has started confidently once again with the bat as @rajasthanroyals reach 47/1 at the end of 6 overs 👌🏻👌🏻
Follow the match ▶️ https://t.co/lHmH28JwFm#TATAIPL | #RCBvRR pic.twitter.com/Ps4Bec0nQv
— IndianPremierLeague (@IPL) April 23, 2023
మొదట్లో తడడిన దేవ్‌దత్ పడిక్కల్(16) దంచుతున్నాడు. విజయ్‌కుమార్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు కొట్టాడు. నాలుగో బంతికి ఫోర్ బాదాడు. దాంతో, 13 రన్స్ వచ్చాయి. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(20) క్రీజులో ఉన్నాడు. 5 ఓవర్లకు స్కోర్.. 36/1.
ఓపెనర్ యశస్వీ జైస్వాల్(15) స్పీడ్ పెంచాడు. సిరాజ్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు కొట్టాడు, దేవ్‌దత్ పడిక్కల్(1) క్రీజులో ఉన్నాడు. 3 ఓవర్లకు స్కోర్.. 16/1.
డేవిడ్ విల్లే బౌలింగ్‌లో యశస్వీ జైస్వాల్(6) బౌండరీ కొట్టాడు, దేవ్‌దత్ పడిక్కల్(0) క్రీజులో ఉన్నాడు. 2 ఓవర్లకు స్కోర్.. 6/1.
రాజస్థాన్ రాయల్స్‌కు షాక్.. విధ్వంసక ఓపెనర్ జోస్ బట్లర్(0)ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. నాలుగో బంతిని డిఫెండ్ చేయబోయిన బట్లర్ అంచనా తప్పింది. బంతి వికెట్లను తాకింది. దాంతో, 1 పరుగు వద్ద ఆ జట్టు తొలి వికెట్ పడింది. యశస్వీ జైస్వాల్(1) క్రీజులో ఉన్నాడు.
𝙍𝙞𝙜𝙝𝙩 𝙩𝙝𝙧𝙤𝙪𝙜𝙝 𝙩𝙝𝙚 𝙙𝙚𝙛𝙚𝙣𝙘𝙚 🔥🔥
An extraordinary delivery THAT 💪🏻@mdsirajofficial cleans up Jos Buttler and continues his habit of striking early for @RCBTweets!
#TATAIPL | #RCBvRR pic.twitter.com/YE4ge4tAU0
— IndianPremierLeague (@IPL) April 23, 2023
కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(62), గ్లెన్ మ్యాక్స్‌వెల్(77) అర్థ శతకం బాదారు. దాంతో, ఆర్సీబీ9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ తొలి బంతికే డకౌటయ్యాడు. ఆ తర్వాత డూప్లెసిస్, మ్యాక్స్‌వెల్ వేగంగా ఆడారు. 11 ఓవర్లకు స్కోర్ వంద దాటించారు. హాఫ్ సెంచరీ తర్వాత జోరు పెంచిన వీళ్లిద్దరు వెంట వెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత ఆర్సీబీ పరుగుల వేగం తగ్గింది. చివర్లో దినేశ్ కార్తిక్(16), మహిపాల్ లొమ్రోర్(8), వనిందు హసరంగ(6) ధాటిగా ఆడడంతో 180 ప్లస్ చేయగలిగింది.
Despite the early wickets, @RCBTweets with a successful powerplay!
FIFTY partnership up in no time between @faf1307 & @Gmaxi_32 🤝
Follow the match ▶️ https://t.co/lHmH28JwFm#TATAIPL | #RCBvRR pic.twitter.com/Zz0O4UKy3n
— IndianPremierLeague (@IPL) April 23, 2023
సందీప్ శర్మ వేసిన 20వ ఓవర్లో దినేశ్ కార్తిక్(16) ఔటయ్యాడు. మొదటి బంతికి ఫోర్ కొట్టిన అతను రెండో బంతికి షాట్ ఆడాడు. బౌండరీ వద్ద బట్లర్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఆ తర్వాత బంతికే విజయ్ కుమార్ ఔటయ్యాడు. ఐదో బంతికి డేవిడ్ విల్లే రివర్స్ స్కూప్‌తో బౌండరీ కొట్టాడు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ రెండేసి వికెట్లు తీశారు. అశ్విన్, చాహల్‌కు ఒక్కో వికెట్ దక్కింది.
ఆర్సీబీ ఆరో వికెట్ పడిందిఔటయ్యాడు. సుయాశ్ ప్రభుదేశాయ్(0) రనౌటయ్యాడు. జైస్వాల్ విసిరిన త్రోను అందుకున్న శాంసన్ వికెట్లను గిరాటేశాడు. దాంతో, సుయాశ్ వెనుదిరిగాడు. దినేశ్ కార్తిక్(3), వనిందు హసరంగ క్రీజులో ఉన్నారు. 17 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 163/6
ఆర్సీబీ ఐదో వికెట్ పడింది. మహిపాల్ లొమ్రోర్(8) ఔటయ్యాడు. చాహల్ బౌలింగ్‌లో దేవ్‌దత్ పడిక్కల్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దినేశ్ కార్తిక్(3) క్రీజులో ఉన్నాడు. 16.3 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 163/5
దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ బ్యాటర్ మాక్స్వెల్ ఔటయ్యాడు. 44 బంతుల్లో 6 బౌండరీలు, 4 సిక్స్‌లతో 77 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. 15వ ఓవర్ ఆఖరి బంతికి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో జాసన్ హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో ఆర్సీబీ స్కోర్ 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులకు చేరింది.
ఆర్సీబీ టీమ్ 14 ఓవర్ల ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 148 పరుగులు రాబట్టింది. గ్లెన్ మాక్స్వెల్ 74 పరుగులతో, మహిపాల్ లోమ్రోర్ ఖాతా తెరుకుండా క్రీజులో ఉన్నారు.
దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ టీమ్‌కు రాజస్థాన్ కళ్లెం వేసింది. 14వ ఓవర్ రెండో బంతికి ఊపు మీదున్న డూప్లెసిస్‌ను రనౌట్ రూపంలో పెవిలియన్‌కు పంపింది. అప్పటికి డూప్లెసిస్ స్కోరు 39 బంతుల్లో 62 పరుగులు. అందులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
డూప్లెసిస్, మాక్స్వెల్ పరుగుల వరద పారిస్తుండటంతో ఆర్సీబీ టీమ్ స్కోర్ బోర్డు పరుగులు పెడుతోంది. 13 ఓవర్ల ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. డూప్లెసిస్ 58, మాక్స్వెల్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఆర్సీబీ బ్యాటర్ డూప్లెసిస్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దాంతో 12 ఓవర్లలో జట్టు స్కోరు రెండు వికెట్ల నష్టానికి 128 పరుగులకు చేరింది. మరో ఎండ్‌లో మాక్స్వెల్ 56 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
మొదట్లో కోహ్లీ, షాబాజ్ ఆహ్మద్ వికెట్లను వెంటవెంటనే కోల్పోయి తడబడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్.. ఆ తర్వాత గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్ డూప్లెసిస్ దూకుడుగా ఆడటంతో పుంజుకుంది. 11 ఓవర్ల ఆట ముగిసే సమయానికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది.
ఆర్సీబీ బ్యాటర్ గ్లెన్ మాక్స్వెల్ హాఫ్ సెంచరీ చేశాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో ఆయన 53 పరుగులు రాబట్టాడు. డూప్లెసిస్ 27 బంతుల్లో 43 పరుగులతో అర్ధసెంచరీకి చేరువలో ఉన్నాడు. దాంతో ఆర్సీబీ జట్టు 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి తొమ్మిది ఓవర్ల ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. డూప్లెసిస్ 35, మాక్స్వెల్ 46 పరుగులతో క్రీజులో ఉన్నారు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి ఎనిమిది ఓవర్ల ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 78 పరుగులు రాబట్టింది. డూప్లెసిస్ 33 పరుగులు, మాక్స్వెల్ 42 పరుగులతో క్రీజులో ఉన్నారు.
తొలి ఏడు ఓవర్ల ఆట ముగిసే సమయానికి ఆర్సీబీ జట్టు రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. గ్లెన్ మాక్స్వెల్ 19 బంతుల్లో 2 సిక్సర్లు, 5 ఫోర్లతో 40 పరుగులు చేశాడు. డూప్లెసిస్ 18 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో 30 పరుగులు రాబట్టాడు.
ఆరు ఓవర్ల ఆట ముగిసే సమయానికి ఆర్సీబీ జట్టు రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. డూప్లెసిస్ 17 బంతుల్లో 29 పరుగులతో, మాక్స్వెల్ 14 బంతుల్లో 31 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఆర్సీబీ జట్టు ఐదు ఓవర్లు ముగిసేసరికి 50 పరుగులు చేసింది. డూప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్ దూకుడుగా ఆడుతుండటంతో మొదట తడబడిన ఆర్సీబీ తర్వాత కోలుకుంది. ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులతో ఉంది.
వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ టీమ్ నాలుగో ఓవర్లో పుంజుకుంది. డూప్లెసిస్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటంతో నాలుగో ఓవర్లో ఏకంగా 16 పరుగులు వచ్చాయి. దాంతో నాలుగో ఓవర్ ముగిసేసరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది.
మూడు ఓవర్ల ఆట ముగిసే సరికి ఆర్సీబీ జట్టు రెండు వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది. డూప్లెసిస్ 10, గ్లెన్ మాక్స్వెల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. తొలి ఓవర్ తొలి బంతికే విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయిన ఆ జట్టు, మూడో ఓవర్ తొలి బంతికి షాబాజ్ వికెట్‌ను కూడా చేజార్చుకుంది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో షాజాబ్ అహ్మద్.. జైశ్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
రెండు ఓవర్ల ఆట ముగిసే సరికి ఆర్సీబీ జట్టు ఒక వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది. మొదటి ఓవర్లో కోహ్లీ వికెట్ కోల్పోయి రెండు పరుగులే చేసిన ఆర్సీబీ.. రెండో ఓవర్లో డూప్లెసిస్ రెండు బౌండరీలు బాదడంతో 10 పరుగులు వచ్చాయి. దాంతో మొత్తం స్కోరు ఒక వికెట్ నష్టానికి 12 పరుగులకు చేరింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తడబడుతూ తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. తొలి ఓవర్ తొలి బంతికే విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో జట్టుపై గట్టి ఎదరుదెబ్బ పడింది. దాంతో తొలి ఓవర్లో ఒక వికెట్ కోల్పోయి రెండు పరుగులు మాత్రమే చేయగలిగింది.
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ తొలి బంతికే కీలకమైన విరాట్ కోహ్లీ వికెట్‌ను కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
ఆర్సీబీ సబ్స్టిట్యూట్స్: హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, ఆకాశ్ దీప్, కరన్ శర్మ, అనూజ్ రావత్.
ఆర్ఆర్ సబ్స్టిట్యూట్స్: అబ్దుల్ బాసిత్, ఆకాశ్ వశిష్ట్, డోనోవాన్ ఫెరీరా, మురుగన్ అశ్విన్, కేఎం ఆసిఫ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: జాస్ బట్లర్, యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్, కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, శిమ్రన్ హిట్మైర్, ధృవ్ జురేల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యజువేంద్ర చాహల్.
రాజస్థాన్ రాయల్స్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఫాఫ్ డూప్లెసిస్, మహిపాల్ లోమ్రార్, గ్లెన్ మాక్స్వెల్, షాబాజ్ అహ్మద్ దినేశ్ కార్తిక్ (వికెట్ కీపర్), సుయాశ్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లే, వనిందు హసరంగ, మహమ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైశాఖ్.