బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ధాటిగా ఆడుతున్న జానీ బెయిర్‌స్టో (66) అవుటయ్యాడు. షాబాజ్ అహ్మద్ వేసిన పదో ఓవర్ తొలి బంతికే బెయిర్‌స్టో పెవిలియన్ చేరాడు. షాబాజ్ వేసిన బంతిని బాదేందుకు క్రీజు వదిలి ముందుకొచ్చిన బెయిర్‌స్టో.. బంతి మరీ ఆఫ్‌సైడ్ రావడంతో సరిగా కనెక్ట్ కాలేదు.
దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న మహమ్మద్ సిరాజ్ వేగంగా స్పందించి క్యాచ్ పట్టేయడంతో బెయిర్‌స్టో సూపర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. పది ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 105 పరుగులతో నిలిచింది.