షార్జా: ఐపీఎల్ ఫైనల్లో ఒక బెర్తును చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఇక రెండో బెర్తు కోసం మొత్తం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. వీటిలో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య సోమవారం నాడు ఎలిమినేటర్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. షార్జా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు బుధవారం జరిగే రెండో క్వాలిఫైయర్‌లో ఢిల్లీని ఢీకొంటుంది. ఈ క్వాలిఫైయర్ గెలిచిన జట్టు శుక్రవారం జరిగే ఫైనల్స్‌లో టైటిల్ కోసం చెన్నైతో పోటీ పడుతుంది.