గుజారాత్ టైటాన్స్‌కు మరో ఝలక్ తగిలింది. షామ్లో ఉన్న ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (31) పెవిలియన్ చేరాడు. హర్షల్ పటేల్ వేసిన 9వ ఓవర్లో బంతిని ఎక్స్ట్రా కవర్ ఫీల్డర్‌కు అందకుండా కొట్టి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే బంతి ఫీల్డర్‌ను దాటే వరకు వెయిట్ చేసిన సాహా.. అప్పుడుగానీ పరుగు కోసం ముందుకు రాలేదు.
అయితే మిడాఫ్‌లో ఉన్న డుప్లెసిస్ వేగంగా ముందుకొచ్చి బంతిని అందుకున్నాడు. అతను నేరుగా వికెట్లను కూల్చడంతో సాహా పెవిలియన్ చేరాల్సి వచ్చింది దీంతో 62 పరుగుల వద్ద గుజరాత్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నాడు.
#RCBvGT#RCBvsGT
Faf == direct hit 🎯 pic.twitter.com/jRyjkgWEGz— Anmol Dixit (@AnmolDi59769126) May 19, 2022