RCB vs DC : భారీ టార్గెట్తో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సోఫీ డెవిన్ (14) ఔట్ అయింది. అలిసే క్యాప్సే ఓవర్లో షఫాలీవర్మ సూపర్ క్యాచ్ పట్టడంతో డెవిన్ వెనుదిరిగింది. దాంతో, 41 పరుగుల వద్ద మొదటి వికెట్ పడింది. ఎలిసే పెర్రీ క్రీజులోకి వచ్చింది. కెప్టెన్ స్మృతి మంధాన (28 ధాటిగా ఆడుతోంది. మరిజానే కాప్ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్ బాదింది. జాన్సెన్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదింది. 5 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోర్.. 47/1 తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 223 పరుగులు చేసింది. ఓపెనర్లు మేగ్ లానింగ్ (72), షఫాలీ వర్మ (84) వీర బాదుడు బాదారు.