RCB vs DC : భారీ లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరింత కష్టాల్లో పడింది. 93 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ తారా నోరిస్ దెబ్బకు స్వల్ప వ్యవధిలోనే సగానికి పైగా వికెట్లు కోల్పోయింది. నోరిస్ వేసిన పదమూడో ఓవర్లో కనికా అహుజా (0), రీచా ఘోష్ (2) ఔటయ్యారు. అంతకుముందు నోరిస్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఆర్సీబీని దెబ్బ కొట్టింది. పదకొండో ఓవర్ మూడో బంతికి ఎలిసే పెర్రీ (31)ని , ఐదో బంతికి దిశా కసత్(9)ను ఔట్ చేసింది. హీథర్ నైట్ (3), ఆశా శోభన (2) క్రీజులో ఉన్నారు. 13 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోర్.. 96/6.
టచ్‌లో ఉన్న కెప్టెన్ స్మృతి మంధాన షాట్‌కు ప్రయత్నించి (35) ఔట్ అయింది. అలిసే క్యాప్సే ఓవర్లో శిఖా పాండ్ క్యాచ్ పట్టడంతో మంధాన ఇన్నింగ్స్ ముగిసింది. 56 పరుగుల వద్ద ఆ జట్టు రెండో వికెట్ పడింది. 41 పరుగుల వద్ద ఓపెనర్ సోఫీ డెవిన్ (14) ఔట్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 223 పరుగులు చేసింది. ఓపెనర్లు మేగ్ లానింగ్ (72), షఫాలీ వర్మ (84) వీర బాదుడు బాదారు.