చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ తడబడుతోంది. మ్యాక్స్‌వెల్ వేసిన పదో ఓవర్లో అంబటి రాయుడు (10) అవుటయ్యాడు. అతను వేసిన షార్ట్ బాల్‌ను ఆడేందుకు ప్రయత్నించిన రాయుడు.. అది స్లో బాల్ కావడంతో మిస్ అయ్యాడు. దాంతో ఆ బాల్.. వికెట్లను కూల్చింది. రాయుడు నిరాశగా మైదానం వీడాడు.
ఇది మ్యాక్స్‌వెల్‌కు రెండో వికెట్ కావడం గమనార్హం. రాయుడు అవుటవడంతో మొయీన్ అలీ క్రీజులోకి వచ్చాడు. డెవాన్ కాన్వే (37 నాటౌట్)తో కలిసి అతను ఇన్నింగ్స్ నిర్మించకుంటే చెన్నై గెలుపు కష్టంగా కనిపిస్తోంది.