బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై జట్టు రెండో వికెట్ కోల్పోయింది. వికెట్లేమీ కోల్పోకుండా పవర్‌ప్లే ముగించిన ఆ జట్టు.. తర్వాతి ఓవర్లోనే రుతురాజ్ గైక్వాడ్ (28) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాతి ఓవర్లో బంతి అందుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా సత్తా చాటాడు.
తన రెండో బంతికే రాబిన్ ఊతప్ప (1)ను పెవిలియన్ చేర్చాడు. మ్యాక్స్‌వెల్ వేసిన బంతిని భారీ షాట్ ఆడిన ఊతప్ప.. బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద ప్రభుదేశాయికి సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 59 పరుగుల వద్ద చెన్నై జట్టు రెండో వికెట్ కోల్పోయింది.