బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓటమి దిశగా సాగుతోంది. ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆ జట్టును గెలిపిస్తారనుకున్న మొయీన్ అలీ (34), ధోనీ (2) ఇద్దరూ ప్రభావం చూపలేకపోయారు. హర్షల్ బౌలింగ్‌లో సిరాజ్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి అలీ పెవిలియన్ చేరాడు.
ఆ మరుసటి ఓవర్లోనే హేజిల్‌వుడ్ ఆఫ్‌సైడ్ వేసిన బంతిని లెగ్‌సైడ్ పుల్ చేసిన ధోనీ.. మిడ్‌వికెట్ బౌండరీ వద్ద పటీదార్‌కు ఈజీ క్యాచ్ ఇచ్చాడు. పటీదార్ ఎలాంటి పొరపాటు చేయకుండా దాన్ని అందుకోవడంతో ధోనీ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీంతో 135 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన చెన్నై గెలుపు ఆశలు దాదాపు మాయమయ్యాయి. ఆ జట్టు గెలవాలంటే చివరి ఓవర్లో ఇంకా 31 పరుగులు చేయాలి.