బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై జట్టుకు శుభారంభం అందించిన డెవాన్ కాన్వే (56) అవుటయ్యాడు. హసరంగ వేసిన 15వ ఓవర్ తొలి బంతికే షాబాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లిన కాన్వే.. అర్ధశతకం పూర్తి చేసుకున్నాక గేరు మార్చేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలోనే హసరంగ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ వద్ద ఉన్న షాబాజ్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు.