బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (24 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్ (28) ఆ జట్టుకు మంచి ఆరంభం అందించారు. అనవసరమైన షాట్లకు పోకుండా లూజ్ డెలివరీలను బౌండరీలకు తరలిస్తూ ఇద్దరూ అద్భుతంగా ఆడుతున్నారు.
ఈ క్రమంలోనే పవర్‌ప్లే ముగిసే సరికి ఆ జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 51 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాతి ఓవర్లోనే రుతురాజ్ భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు.
షాబాజ్ వేసిన బంతిని లెగ్‌సైడ్ బౌండరీకి తరలించేందుకు రుతురాజ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సూయష్ ప్రభుదేశాయి.. పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ పట్టేయడంతో రుతురాజ్ వెనుతిరిగాడు.