చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారధి ఫాఫ్ డు ప్లెసిస్ (35 నాటౌట్) ధాటిగా ఆడుతున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన బెంగళూరు జట్టుకు కోహ్లీ (20 నాటౌట్)తో కలసి శుభారంభం అందించాడు. కోహ్లీ ఆచితూచి ఆడుతుండగా.. డుప్లెసిస్ ధాటిగా ఆడుతున్నాడు.
ముఖ్యంగా ముఖేష్ చౌదరి వేసిన దో ఓవర్లో డుప్లెసిస్ దంచికొట్టాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 18 పరుగులు రాబట్టాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి బెంగళూరు జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 57 పరుగులు చేసింది.