చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (3) రనౌట్ అయ్యాడు. జడేజా వేసిన బంతిని ఆడిన కోహ్లీ పరుగు కోసం ప్రయత్నించాడు. దానికి స్పందించిన మ్యాక్సీ డేంజర్ ఎండ్‌కు పరుగు తీశాడు. అయితే అద్భుతంగా ఫీల్డింగ్ చేసిన ఊతప్ప.. బంతిని తీసుకున్న తర్వాత క్షణం కూడా ఆలస్యం చేయకుండా ధోనీ వైపు విసిరాడు.
దీంతో ధోనీ వికెట్లను కూల్చాడు. రనౌట్ కోసం అప్పీల్ చేయగా అంపైర్.. థర్డ్ అంపైర్‌కు పంపాడు. రిప్లేలో మ్యాక్స్‌వెల్ క్రీజుకు చాలా దూరంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో మ్యాక్సీ నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాతి ఓవర్లోనే విరాట్ కోహ్లీ (30) కూడా పెవిలియన్ చేరాడు. చాలా నిదానంగా ఇన్నింగ్స్ నిర్మించిన కోహ్లీ.. మొయీన్ అలీ వేసిన బంతిని సరిగా జడ్జ్ చేయలేకపోయాడు. దీంతో క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరాడు.