IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ సమీపిస్తున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. నిరుడు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట (Stampede)లో మృతి చెందిన 11 మంది అభిమానులను ఆర్సీబీ స్మరించుకోనుంది. విజయోత్సవ యాత్రలో పాల్గొనేందుకు వచ్చి అసువులు బాసిన ఆ పదకొండు మంది అభిమానుల జ్ఞాపకార్ధం ప్రతి మ్యాచ్కు 11 సీట్లు రిజర్వ్ చేయాలని ఆర్సీబీ యాజమాన్యం, కర్నాటక క్రికెట్ సంఘం నిర్ణయం తీసుకున్నాయి.
పంతొమ్మిదో సీజన్లో ఆరంభ పోరుకు మరో నాలుగు రోజులే ఉంది. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆడబోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక నిర్ణయం తీసుకుంది. నిరుడు జూన్ 4వ తేదీన చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన 11 మంది అభిమానుల జ్ఞాపకార్థం ప్రతి మ్యాచ్లో 11 సీట్లను రిజర్వ్ చేయాలని ఆర్సీబీ, కర్నాటక క్రికెట్ సంఘం భావిస్తున్నాయి. ఈ విషయాన్ని బెంగళూరు యాజమాన్యం ధ్రువీకరించింది. ఇదివరకే ఆ 11 మంది కుటుంబాలకు రూ.10 లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించిన ఆర్సీబీ ఇప్పుడు మైదానంలో వారికి ప్రత్యేక గౌరవం కల్పించనుంది.
తొక్కిసలాటలో చనిపోయిన 11 మంది అభిమానుల జ్ఞాపకార్థం ప్రతీ మ్యాచ్కి 11 సీట్లు రిజర్వ్
ఐపీఎల్ సందర్భంగా RCB, కర్ణాటక అసోసియేషన్ల కీలక నిర్ణయం
గత ఏడాది RCB ఐపీఎల్ టైటిల్ గెలిచిన నేపధ్యంలో జరిగిన సెలబ్రేషన్స్ వేడుకల్లో తొక్కిసలాటలో చనిపోయిన 11 మంది అభిమానులు
వారి జ్ఞాపకార్థం ప్రతీ… https://t.co/lqgOW2tf2U pic.twitter.com/m2yuzRfCCx
— Telugu Scribe (@TeluguScribe) March 24, 2026
RCB and KSCA will honour the victims of the June 4th stampede with a memorial plaque, alongside reserving 11 empty seats inside the stadium. pic.twitter.com/UBXZl1px0e
— RevSportz Global (@RevSportzGlobal) March 24, 2026
ఐపీఎల్ 18వ సీజన్ ఛాంపియన్గా అవతరించిన ఆర్సీబీ మరుసటి రోజే కర్నాటకలో విజయయాత్రకు పిలుపునిచ్చింది. విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకూ విక్టరీ పరేడ్లో నిర్వహిస్తామని, అభిమానులు భారీగా తరలిరావాలని బెంగళూరు ఫ్రాంచైజీ కోరింది. కానీ, అందుకు తగిన భద్రతా ఏర్పాట్లను మాత్రం చేయలేదు. అందుకే తొక్కిసలాటకు ఆర్సీబీ యాజమాన్యమే ప్రథమ దోషి అని క్యాట్ అభిప్రాయపడింది.

‘ఐపీఎల్ విజేతగా నిలిచిన తర్వాత బెంగళూరు టీమ్ ఎక్స్ వేదికగా విక్టరీ పరేడ్ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ జూన్ 4న చిన్నస్వామికి భారీగా తరలివచ్చారు. 35 వేల సామర్థ్యం ఉన్న స్టేడియానికి 2.5లక్షల మంది రావడంతో పోలీసులు వాళ్లను అదుపు చేయలేకపోయారు. పైగా వాళ్లకు అంతమందిని నియంత్రించేందుక అవసమరైన బలగాలను సమకూర్చుకునే సమయం కూడా లేకపోయింది. అయినా పోలీసులేమీ దేవుళ్లు కాదు కదా.. అంతా క్షణాల్లో అదుపు చేయడానికి. సో.. ఈ దుర్ఘటనకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని చెబుతూ ఆర్సీబీ యాజమాన్యం తప్పించుకోవడానికి లేదని క్యాట్ వెల్లడించింది.

చిన్నస్వామి తొక్కిసలాట తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ దేవ్జిత్ సైకియా(Devjit Saikia) సైతం ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా విక్టరీ పరేడ్ జరపడాన్ని ఖండించాడు. దాంతో, ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కర్నాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఫలితంగా ఆర్సీబీ, కర్నాటక క్రికెట్ సంఘం, ఈవెంట్ ప్లానింగ్ సంస్థపై కేసులు నమోదయ్యాయి. అనంతరం కేసీసీఏ సెక్రటరీ ఏ శంకర్, కోశాధికారి జయరామ్ రాజీనామా చేశారు. భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా బీసీసీఐ మార్గదర్శకాలు జారీ చేసింది.