IPL 2026 : ఒకప్పుడు ఐపీఎల్ మ్యాచ్‌లతో కోలాహలంగా కనిపించిన చిన్నస్వామి స్టేడియా (Chinnaswamy Stadium)నికి పూర్వ వైభవం తేవాలని కర్నాటక క్రికెట్ సంఘం (KSCA) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎలాగైనా ఐపీఎల్ మ్యాచ్‌లను మళ్లీ చిన్నస్వామిలో నిర్వహించాలనే ఉద్దేశంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. స్టేడియంలో అభిమానులను నియంత్రించేందుకు, వారికి భద్రత కల్పించేందుకు కృత్రిమ మేధ(Artificial Intelligence)తో పనిచేసే కెమెరాలు ఉపయోగిస్తామని ఆర్సీబీ యాజమాన్యం తెలిపింది.
నిరుడు జూన్ 4వ తేదీన తొక్కిసలాటలో 11 మంది మరణించడంతో చిన్నస్వామి స్టేడియం మూత పడింది. భద్రతాపరమైన లోపాలు ఉన్నందున చిన్నస్వామిలో మ్యాచ్‌ల నిర్వహణకు కోర్టు ససేమిరా అంది. పోలీసులు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దాంతో.. అప్పటి నుంచి ఆ మైదానంలో ఒక్క క్రికెట్ మ్యాచ్ కూడా జరగలేదు. ఇటీవలే విజయ్‌హజారే ట్రోఫీ మ్యాచ్‌లకు కూడా చిన్నస్వామి మైదానం నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ఈమధ్యే ఎన్నికైన వెంకటేశ్ ప్రసాద్ నేతృత్వంలోని కొత్త కార్యవర్గం పూర్వవైభవంపై దృష్టి సారించింది. ఈ మేరకు ఆర్సీబీ యాజమాన్యంతో చర్చలు జరిపింది. చిన్నస్వామిలో భద్రతపై భరోసా కల్పించేందుకు అనువైన చర్యలను ప్రకటించింది.
𝗥𝗖𝗕 𝗖𝗔𝗥𝗘𝗦: Advanced AI video analytics technology for 𝗰𝗿𝗼𝘄𝗱 𝗺𝗮𝗻𝗮𝗴𝗲𝗺𝗲𝗻𝘁 at the 𝘊𝘩𝘪𝘯𝘯𝘢𝘴𝘸𝘢𝘮𝘺 𝘚𝘵𝘢𝘥𝘪𝘶𝘮.
In a formal communication to the KSCA, RCB has proposed the installation of 300 to 350 AI-enabled cameras at the M. Chinnaswamy Stadium.… pic.twitter.com/LuJ3v4uNwa
— Royal Challengers Bengaluru (@RCBTweets) January 16, 2026
తొక్కిసలాట అనంతరం ‘ఖేల్ డీ కున్హ కమిషన్’ (Michael De Cunha Commission) కర్నాటక క్రికెట్ సంఘానికి కీలక సూచనలు చేసింది. అభిమానుల భద్రత కోసం తగిన ఏర్పాట్లు చేసిన తర్వాతే మ్యాచ్‌ల గురించి ఆలోచించాలని ఈ ఏకసభ్య కమిషన్ పేర్కొంది. దాంతో.. చిన్నస్వామి స్టేడియంలో 300 నుంచి 350 ఏఐతో పనిచేసే కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆర్సీబీ, కర్నాటక క్రికెట్ సంఘం భావిస్తున్నాయి.
కృత్రిమ మేధతో పనిచేసే కెమెరాల సాయంతో పోలీసులు ప్రేక్షకుల మధ్య తోపులాట జరగకుండా చూస్తారు. అంతేకాదు స్టేడియంలోకి అభిమానులను అనుమతించేటప్పుడు, మ్యాచ్ అనంతరం బయటకు వెళ్లేటప్పుడు క్యూలో వెళ్లేలా చర్యలు తీసుకుంటారు. తద్వారా ఎవరికి ఎలాంటి ఇబ్బంది, ప్రమాదం జరగకుండా చూసుకుంటామని ఆర్సీబీ, కేఎస్‌సీఏ అంటున్నాయి. అందుకని ఒక్కసారే స్టేడియమంతా రూ.4.5 కోట్లు ఖర్చుతో ఈ ఏఐ కెమెరాలను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని ఫ్రాంచైజీ వెల్లడించింది.
Royal Challengers Bengaluru (@RCBTweets) has proposed installing AI enabled surveillance cameras at the M. Chinnaswamy Stadium as part of efforts to strengthen crowd safety and management, following reports that questioned the venue’s readiness after the tragic stampede during… pic.twitter.com/XfF6SkUgOV
— AIM (@Analyticsindiam) January 16, 2026
ప్రస్తుతానికైతే చిన్నస్వామిలో ఐపీఎల్ మ్యాచ్‌లకు అనుమతులు లేవు. బీసీసీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా? లేదా? అనే విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది. ఒకవేళ ఆమోదం రాకుంటే బెంగళూరు బయట ఐపీఎల్ ఆడేందుకు ఆర్సీబీ సిద్ధమవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే పుణేలోని స్టేడియాన్ని ఫ్రాంచైజీ పరిశీలించింది. సో.. ఐపీఎల్ షెడ్యూల్ వచ్చాకే చిన్నస్వామిలో మ్యాచ్‌లు ఉంటాయా? ఉండవా? అనేది తెలియనుంది.