Lauren Bell : మహిళల ప్రీమియర్ లీగ్‌లో మాజీ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుస విజయాలతో దూసుకెళ్లుతోంది. బ్యాటింగ్, బౌలింగ్.. ఫీల్డింగ్ విభాగాల్లో అదరగొడుతూ ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది మంధాన సేన. టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తున్న ఆర్సీబీ కంటే ఆ విజయాల్లో కీలకమవుతున్న పేసర్ లారెన్ బెల్ (Lauren Bell ) గురించే చర్చించుకుంటున్నారంతా. పవర్ ప్లేలో వికెట్ల వేటతో శుభారంభాలు ఇస్తున్న ఈ పాతికేళ్ల పేస్ సంచలనం.. తన స్టన్నింగ్ బ్యూటీతో భారత కుర్రాళ్ల మనసు దోచేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత అందమైన క్రికెటర్‌గా కితాబులందుకుంటున్న ఈ పొడగరి పేసర్ విశేషాలు తెలుసుకుందాం.
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్లో లారెన్ బెల్ లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాటర్లను బోల్తా కొట్టిస్తోంది. పవర్ ప్లేలోనే వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలో పడేస్తున్న లారెన్.. చూపుతిప్పుకోనివ్వని అందంతోనై వైరలవుతోంది. అయితే.. పెద్దయ్యాక తాను క్రికెటర్ అవ్వాలని ఆమె అనుకోలేదట. ‘నా చిన్నప్పుడు మా తాతయ్య మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ జెర్సీ, కిట్స్ తీసుకొచ్చేవారు. దాంతో.. నాకు ఫుట్‌బాల్‌పై ఇష్టం పెరిగింది. కాస్త టైమ్ దొరికితే చాలు మా గార్డెన్లో క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్ ఆడేదాన్ని.
Lauren Bell first wpl with RCB
First maiden over of WPL
She took wickets pic.twitter.com/JEUKgNKOoJ— the unknown memes (@theunknowmemes) January 9, 2026
స్థానిక ‘రీడింగ్స్ ఫుట్‌బాల్ అకాడమీ’ తరఫున కూడా ఆడాను. 14 ఏళ్లకే హ్యాంప్‌షైర్ జట్టు పేసర్‌గా ఎంపికయ్యా. సో.. నన్ను ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు, క్రికెట్ మ్యాచ్‌లకు తీసుకెళ్లడం మా అమ్మానాన్నకు ఇబ్బందిగా తోచింది. దాంతో.. ఫుట్‌బాలా? క్రికెట్టా? ఏదో ఒకటి ఎంచుకో అని నిర్ణయం నాకే వదిలేశారు. దాంతో.. నేను 16 ఏళ్లకు క్రికెట్ వైపు మళ్లాను. అప్పటి నుంచి ఫుట్‌బాల్ ఆడడం మానేశా. అందుకు ఒకింత బాధగానే ఉంది. కానీ, ఇప్పుడు క్రికెటర్‌గా నేను గొప్పగా రాణిస్తున్నందుకు సంతోషంగా ఉంది అని స్పీడ్‌స్టర్ గతంలో ఓసారి చెప్పింది. ఇంగ్లండ్‌లోని స్విండన్ అనే పట్టణంలో ఆండీ బెల్, మొరాగ్ బెల్ అనే దంపతులకు జన్మించింది లారెన్.
Peak female beauty Lauren Bell 🫠❤️
— Yash MSdian ™️ 🦁 (@itzyash07) January 12, 2026
లారెన్ బెల్‌ను క్రికెట్ జెర్సీలో కాకుండా ఇతర దుస్తుల్లో చూస్తే ఎవరైనా సరే తను మోడల్ అని పొరపడుతారు. ఎందుకంటే.. మెరిసే మేని ఛాయ, ఆరడుగుల రెండంగుళాల పొడవు.. చూసేందుకు రెండు కళ్లు చాలని సోయగం ఆమె సొంతం. పొరపాటున క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుందిగానీ లేదంటే విశ్వ సుందరి అయ్యేది అనేవాళ్లు లేకపోలేదు. కానీ, తను మాత్రం క్రికెట్ మీదే దృష్టి పెట్టింది. నాwలుగేళ్ల క్రితం (2022 జూన్‌లో) అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. దక్షిణాఫ్రికాపై తొలి మ్యాచ్ ఆడిన బెల్ నినిలకడగా రాణిస్తూ ఇంగ్లండ్ జట్టులో ప్రధాన పేసర్‌గా అవతరించింది. ఇప్పటివరకూ వన్డేల్లో 44, టెస్టుల్లో 18, టీ20ల్లో 50 వికెట్లు పడగొట్టింది బ్యూటిఫుల్ పేసర్.
నిరుడు భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో 6 వికెట్లు తీసిన బెల్ డబ్ల్యూపీఎల్ వేలంలో భారీ ధర పలికింది. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొన్న ఈ పేస గన్ను రూ.90లక్షలకు కొన్నది ఆర్సీబీ. ఫ్రాంచైజీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తొలి మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్ (Mumbai Indians)పై 14 పరుగులే ఇచ్చి బిగ్ వికెట్ తీసింది. డేంజరస్ అమేలియా కేర్‌ను ఔట్ చేసి ముంబైని షాకిచ్చిందీ ఇంగ్లండ్ స్టార్.
Menace has six letters. So does Lauren. 😤
What a start for Bellsy in the Red & Gold threads. ❤️🔥#PlayBold #ನಮ್ಮRCB #WPL2026 #RCBvUPW pic.twitter.com/rZIpCOkHDc
— Royal Challengers Bengaluru (@RCBTweets) January 12, 2026
రెండో మ్యాచ్‌లో యూపీ వారియర్స్పైనా చెలరేగుతూ.. తన మూడో ఓవర్లలోనే ఓపెనర్ హర్లీన్ డియోల్ వికెట్ తీసి ఆర్సీబీకి బ్రేకిచ్చింది. డబ్ల్యూపీఎల్‌లో తళుక్కుమంటున్న లారెన్ బెల్కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భారీగానే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఇంగ్లండ్ అందాన్ని10 లక్షల మందికిపైగా ఫాలో అవుతున్నారు.