RCB Vs CSK | చెన్నై సూపర్ కింగ్స్‌కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు శుభారంభం అందించారు. చివరలో రమిరియో షెప్పర్డ్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. టాస్ గెలిచిన సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన జాకబ్ బెథెల్-విరాట్ కోహ్లీ జోడీ అర్ధసెంచరీలతో చెలరేగింది. విరాట్ కోహ్లీ 33 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 62 పరుగులు చేశాడు. ఈ క్రమంలో విరాట్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 300 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. మరో ఓపెనర్ జాకబ్ 33 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 55 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయ్యాక స్కోర్ కాస్త నెమ్మదించింది. దేవ్‌దత్ పడిక్కల్ (17), రజత్ పాటిదార్ (11), జితే శర్మ (7) పరుగులు చేయగలిగారు. ఇక చివరలో రొమారియో షెపర్డ్ చెలరేగాడు. సిక్సర్లతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. షెపర్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా ఆర్సీబీ భారీ స్కోర్ చేయగలిగింది. షెపర్డ్ 14 బంతుల్లో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్ల సహాయంతో 53 పరుగులు చేశాడు. 378.57 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు చేయడం విశేషం. ఐపీఎల్లో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. పాట్ కమ్మిన్స్, కేఎల్ రాహుల్ రికార్డును సమం చేశాడు. వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు యశస్వి జైస్వాల్ పేరిట ఉన్నది. జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇదిలా ఉండగా.. చెన్నై బౌలర్లలో మతీష పతిరాణాకు మూడు, శామ్ కర్రన్‌కు ఒకటి, నూర్ అహ్మద్‌కు తలో వికెట్ దక్కింది.
ఒకే జట్టు తరఫున ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. సీఎస్కే బౌలర్ ఖలీల్ అహ్మద్ వేసిన మూడో ఓవర్లో చివరి రెండు బంతులను విరాట్ భారీ సిక్సర్లుగా మలిచి.. ఈ ఫీట్‌ని సాధించడు. కే జట్టు తరపున అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ల జాబితాలో (301తో) విరాట్ అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఆర్సీబీ మాజీ ఆటగాడు 263 సిక్సర్లతో క్రిస్ గేల్ ఉన్నాడు. ముంబయి ఇండియన్స్ తరఫున ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ 262, కీరన్ పోలార్డ్ 258 సిక్సర్లు కొట్టారు. సీఎస్కే తరఫున ధోనీ 257 సిక్స్‌లు బాదాడు. ఐపీఎల్లో గత 18 సీజన్లుగా విరాట్ కోహ్లీ ఆర్సీబీకే ఆడుతున్న విషయం తెలిసిందే.