IPL-2023 | బెంగళూరు ఫ్లే ఆఫ్స్ ఆశలు సజీవం.. రాజస్థాన్‌పై ఘన విజయం
IPL-2023 | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 172 పరుగులు చేయాల్సిన రాజస్థాన్ రాయల్స్ జట్టును 59 పరుగులకే ఆలౌట్ చేసింది.
IPL-2023 | రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ (ఆర్సీబీ) ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకున్నది. ఆదివారం తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు విజ్రుంభించారు. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఆర్సీబీ 112 పరుగుల తేడాతో ఘన విజయం సొంతం చేసుకున్నది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆప్స్ ఆశలు సంక్లిష్టంగా మారాయి.
ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ (ఆర్సీబీ) నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 171 పరుగులు చేసింది. 172 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించలేక రాజస్థాన్ రాయల్స్ చతికిల పడింది. 59 పరుగులకే ఆలౌట్ అయింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లలో హెట్ మయర్ మాత్రమే 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లెవరూ బెంగళూరు బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయారు. బెంగళూరు బౌలర్లు పార్నెల్ మూడు, బ్రాస్ వెల్ రెండు, కర్ణ్ శర్మ రెండు, సిరాజ్, మ్యాక్స్ వెల్ ఒక్కో వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాటర్లలో డ్యూప్లెసిస్ 44 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 55 పరుగులు, మ్యాక్స్ వెల్ 33 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్స్‌లతో 54 పరుగులతో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. చివర్లో మెరుపులు మెరిపించిన అనూజ్ రావత్ 11 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 29 పరుగులు చేయడంతో బెంగళూరు స్కోర్ 170 పరులు దాటింది. విరాట్ కోహ్లీ 18 పరుగులు చేస్తే, మహిపాల్ లామ్రోర్ ఒక సింగిల్ పరుగు, దినేష్ కార్తిక్ డకౌట్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అసిఫ్, అడమ్ జంపా చెరో రెండు వికెట్లు, సందీప్ శర్మ ఒక వికెట్ తీసుకున్నాడు.టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

