IPL 2025 : క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ పేసర్లు నిప్పులు చెరుగుతున్నారు. పవర్ ప్లేలో వరుసగా వికెట్లు తీస్తూ పంజాబ్ కింగ్స్(Punjab Kings)ను ఒత్తిడిలోకి నెట్టేశారు. యశ్ దయాల్, సీనియర్ పేసర్ భువనేశ్వర్(1-17) ధాటికి ఫామ్‌లో ఉన్న పంజాబ్ ఓపెనర్లు వరుసగా పెవిలియన్ చేరారు. ఆ కాసేపటికే హేజిల్‌వుడ్(2-14) తన పేస్ పవర్ చూపిస్తూ.. శ్రేయస్ అయ్యర్(2)ను ఔట్ చేశాడు. అంతే.. 30 పరుగులకే మూడు కీలక వికెట్లు పడ్డాయి.
ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్న వేళ జోష్ ఇంగ్లిస్(4) ధనాధన్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ, హేజిల్‌వుడ్ అతడిని ఊరించే బంతితో పెవిలియన్ పంపాడు. అంతే.. చూస్తుండగానే 4 వికెట్లు కోల్పోయింది పంజాబ్. ప్రస్తుతం నేహల్ వధేరా (6 నాటౌట్), మార్కస్ స్టోయినిస్(10 నాటౌట్)లు భాగస్వామ్యం నిర్మించే పనిలో ఉన్నారు. హ ఆరు ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 48-4.
Josh is soooo back! 🔥
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 29, 2025
టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్‌కు యశ్ దయాల్ ఆదిలోనే షాకిచ్చాడు. ఈ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న ప్రియాన్ష్ ఆర్య (5)ను దయాల్ బోల్తా కొట్టించాడు. దాంతో 9 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ పడింది. యశ్ దయాల్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడే క్రమంలో ఆర్య ఔటయ్యాడు ఆ కాసేపటికే భువీ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్(18) కూడా వికెట్ కీపర్ జితేశ్ చేతికి చిక్కాడు.
Perfect ball. Perfect fielding position.
PERFECT SET-UP. ✍️
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 29, 2025
కష్టాల్లో పడిన జట్టును ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(2)ను హేజిల్‌వుడ్ వెనక్కి పంపాడు. స్ట్రెయిట్ షాట్ కొట్టాలనుకున్న అయ్యర్.. బంతిని మిడిల్ చేయలేక జితేశ్‌కు సులువైన క్యాచ్ ఇచ్చాడు. 3.4 ఓవర్లలో 30 కే మూడు వికెట్లు పడడంతో పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో ఉంది.