RCB vs PBKS : డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై అదిరే విజయంతో నాకౌట్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా అవతరిచింది. వెంకటేశ్ అయ్యర్(73 నాటౌట్), విరాట్ కోహ్లీ(58)లు అర్ధ శతకాలతో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిలిపిన బెంగళూరు రసిక్ దార్(3-36), భువనేశ్వర్(2-38) కృషితో 23 పరుగులతో గెలిచింది. శశాంక్ సింగ్(56) ఒంటరి పోరాటం చేసినా పంజాబ్‌కు వరసగా ఆరో ఓటమి తప్పించలేకపోయాడు.
భారీ ఛేదనలో తొలి ఓవర్లోనే ప్రియాన్ష్ ఆర్య(0)ను ఔట్ చేసిన భువనేశ్వర్(2-38).. డేంజరస్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(2)ను వెనక్కి పంపి పంజాబ్‌కు షాకిచ్చాడు. ప్రభ్‌సిమ్రన్ ఆడిన బంతిని స్లిప్‌లో పడిక్కల్ రెప్పపాటులో క్యాచ్ అందుకోగా పంజాబ్ 18వద్ద రెండో వికెట్ కోల్పోయింది. కూపర్ కొన్నొల్లీ(37), కెప్టె్న్ శ్రేయాస్ అయ్యర్(1)లు.. ఆదుకునే ప్రయత్నం చేయబోయారు. కానీ, రసిక్ దార్(3-36) సూపర్ డెలివరీతో అయ్యర్ వికెట్ కీపర్ జితేశ్ చేతికి దొరికాడు. పవర్ ప్లేలోనే కష్టాల్లో పడిన జట్టును సూర్యాన్ష్ షెడ్గే(35)తో కలిసి గెలిపించాలనుకున్న కూపర్ నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. షెపర్డ్ ఓవర్లో పెద్ద షాట్ ఆడి బౌండరీ వద్ద బెథెల్ చేతికి చిక్కాడు.
Josh Hazlewood turns breakthrough provider 💪
He traps Marcus Stoinis in front to break a dangerous stand ☝️
Updates ▶️ https://t.co/3u5qL0Zn75#TATAIPL | #KhelBindaas | #PBKSvRCB pic.twitter.com/UfVpTB2Zv5
— IndianPremierLeague (@IPL) May 17, 2026
కాసేపటికే షెడ్గే ఔటవ్వగా.. ఇంప్యాక్ట్ సబ్ స్టోయినిస్(37), శశాంక్ సింగ్(56)లు దూకుడుగా ఆడారు. సుయాశ్ ఓవర్లో శశాంక్ మూడు సిక్సర్లతో 13 ఓవర్లకు స్కోర్ 120 దాటింది. కానీ, బెంగళూరు బౌలర్లు, ఫీల్డర్లు బౌండరీలు ఇవ్వలేదు. స్టోయినిస్‌ను హేజిల్‌వుడ్ ఎల్పీగా వెనక్కి పంపి పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లాడు. చివరి ఓవర్లో 33 రన్స్ అవసరమవ్వగా రెండో బంతికి శశాంక్ ఔటయ్యాడు. అంతే ఆర్సీబీ 23 పరుగుల తేడాతో గెలిచి దర్జాగా ప్లే ఆఫ్స్ దూసుకెళ్లింది.
The 𝘁𝗶𝘁𝗹𝗲 𝗱𝗲𝗳𝗲𝗻𝗰𝗲 is ON! 🏆
Reigning champions @RCBTweets become the 1⃣st team to enter the #TATAIPL 2026 Playoffs 😎 ❤️
Scorecard ▶️ https://t.co/3u5qL0Zn75#KhelBindaas | #PBKSvRCB pic.twitter.com/1XAjPzeHnV
— IndianPremierLeague (@IPL) May 17, 2026
ప్లే ఆఫ్స్‌కి అడుగు దూరంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ కొట్టింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లకు చుక్కులు చూపిస్తూ ధర్మశాలలో వెంకటేశ్ అయ్యర్(73 నాటౌట్), విరాట్ కోహ్లీ(58) అర్ధ శతకాలతో కదం తొక్కారు. పడిక్కల్(45)తో విరాట్ కీలక భాగస్వామ్యం నెలకొల్పగా.. ఆ తర్వాత అయ్యర్, టిమ్ డెవిడ్(28)లు ఉతికేశారు. దాంతో, పంజాబ్ ముందు కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించింది బెంగళూరు.