IPL 2026 : క్రికెట్ అభిమానులకు వినోదం పంచేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియంలో పంతొమ్మిదో సీజన్ ఆరంభ మ్యాచ్‌తో క్రీడా సంబురానికి తెరలేవనుంది. దాంతో, అభిమానులు భారీగా చిన్నస్వామికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు ఆటోవాలాలు అభిమానులకు బంపరాఫర్ ప్రకటించారు. ఐపీఎల్ క్రేజ్‌కు తమవంతు ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో ఆర్సీబీ జెర్సీ వేసుకున్న వాళ్లకు ఆటోలో ప్రయాణం ఉచితమని చెబుతున్నారు.
ఐపీఎల్ ఆరంభ పోరుతో చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ క్రికెట్ సందడి మొదలవ్వనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మరోసారి టైటిల్ పట్టేయాలనే కసితో ఉంది. ఆ జట్టు అభిమానులు సైతం ఈసాలా కప్ నమదే అంటున్నారు. బెంగళూరు ఆటోవాలాలు అయితే.. ఆర్సీబీ అభిమానులకు అదిరే ఆఫర్ ఇచ్చారు.
There’s something about cricket in India that you can’t really explain. It’s been there since childhood, in the background of every home, every conversation, every summer. And then IPL comes around and suddenly it’s everywhere again.
And RCB fans, honestly, the most patient and… pic.twitter.com/KayCaxPHVO
— Mahika Jadhav (@mahikaa101) March 28, 2026
‘ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉంది. ఆర్సీబీ జెర్సీ వేసుకుంటే మీరు ఉచితంగా ఆటోలో ప్రయాణించవచ్చు. ఈసాలా కప్ నమదు ఆర్సీబీ 2.0. ఎల్లప్పుడూ ఆర్సీబీ అభిమానులం’ అని రాసున్న కాగితంను తమ సీటు వెనకాల అతికించారు కొందరు ఆటో డ్రైవర్లు. మహికా జాదవ్ అనే ట్విట్టర్ యూజర్ పెట్టిన ఫొటోప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. నిర్మాణపరమైన మార్పులతో కొత్త హంగులు దిద్దుకున్న చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:00 గంటలకు టాస్, అనంతరం 30 నిమిషాలకు ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ జరుగనుంది.