RCB CEO : వరల్డ్ కప్ హీరోగా.. రికార్డుల రారాజుగా ప్రశంసలందకున్న విరాట్ కోహ్లీ(Virat Kohli) ఐపీఎల్‌లోనూ ఛాంపియన్‌గా మురిసిపోతున్నాడు. వరసగా రెండు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ట్రోఫీ కలను సాకారం చేసిన విరాట్ మరిన్ని టైటిళ్లు గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ మరో నాలుగేళ్లు ఆర్సీబీతో కొనసాగుతాడని సీఈవో రాజేశ్ మీనన్(Rajesh Menon) అంటున్నాడు.
ఐపీఎల్ అరంగేట్రం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే ఆడుతున్న విరాట్ కోహ్లీ.. రెండుసార్లు ఛాంపియన్ అనిపించుకున్నాడు. నాయకుడిగా ట్రోఫీ ముద్దాడకున్నా.. 18, 19వ సీజన్లలో బెంగళురు విజయాల్లో విరాట్ కీలకమయ్యాడు. అందుకే.. ‘ఆర్సీబీ అంటే కోహ్లీ.. కోహ్లీ అంటే ఆర్సీబీ’ అనే పేరు ముద్ర పడింది. టీ20లకు వీడ్కోలు పలికినప్పటి నుంచి మరింత రెచ్చిపోతున్న విరాట్ మరో నాలుగేళ్లు ఆర్సీబీతోనే కొనసాగుతాడని సీఈవో రాజేశ్ మీనన్ పేర్కొన్నాడు.
“I’m sure he’ll be playing for at least four years” – RCB CEO Rajesh Menon on Virat Kohli pic.twitter.com/O0qbyBkc7d
— ESPNcricinfo (@ESPNcricinfo) June 18, 2026
‘ఆర్సీబీ, విరాట్ కోహ్లీ ఒకే నాణేనికి రెండువైపులు. ఆర్సీబీ విజయవంతమవ్వడంతో కోహ్లీ చాలా కీలకం. క్రికెట్‌కు వీడ్కోలు పలికినా సరే అతడిని మేము ఆర్సీబీ స్క్వాడ్‌లో ఒకడిగానే చూస్తాం. ఈ విషయాన్ని మేము ధ్రువీకరిస్తాం. వచ్చే మూడు నాలుగేళ్లు విరాట్ ఆర్సీబీకి ఆడుతాడని నాకు నమ్మకముంది’ అని సీఈవో రాజేశ్ మీనన్ పేర్కొన్నాడు. 2008 ఆరంభ సీజన్ నుంచి ఆర్సీబీ జెర్సీతోనే కనిపిస్తున్న విరాట్.. తనలో పరుగుల దాహం తగ్గలేదని చాటుకున్నాడు. సీజన్ సీజన్‌కు కుర్రాళ్లతో పోటీగా రన్స్ కొడుతున్న మాజీ కెప్టెన్ ఆర్సీబీ అభిమానుల కలల్ని నిలబెట్టాడు.