Ravindra Jadeja : ఐసీసీ (ICC) టెస్టు ర్యాంకింగ్స్ (Test rankings) లో ఆల్ రౌండర్స్ (All rounders) జాబితాలో భారత స్టార్ స్పిన్నర్ (Star spinner) రవీంద్ర జడేజా (Ravindra Jadeja) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఏకంగా 400 రేటింగ్ పాయింట్స్‌తో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. అయితే బంగ్లాదేశ్ (Bangladesh) క్రికెటర్ మెహిదీ హసన్ మిరాజ్ (Mehidy Hasan Miraz) ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు.
ఐసీసీ అఫీషియల్ వెబ్సైట్లో బుధవారం తాజా ర్యాంకింగ్స్‌ను పొందుపర్చారు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో మిరాజ్ 116 పరుగులు రాబట్టడమేగాక, 15 వికెట్లు తీశాడు. దాంతో ఆల్‌రౌండర్స్ జాబితాలో అతను ఒక స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. అంతేగాక రెండో టెస్టులో సెంచరీ ద్వారా మిరాజ్.. ఐసీసీ బ్యాటర్స్ జాబితాలో కూడా 8 స్థానాలు మెరుగుపర్చుకుని 55వ స్థానానికి చేరుకున్నాడు.
ఇంగ్లండ్ బ్యాటర్ జోయ్ రూట్ ఈసారి కూడా టాప్-20లో చోటు దక్కించుకోలేకపోయారు. అయితే జింబాబ్వే లెఫ్ట్ హ్యాండర్ సీన్ విలియమ్స్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 19వ స్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో బంగ్లాదేశ్‌కు చెందిన షడ్మాన్ ఇస్లామ్ ఏకంగా 17 స్థానాలు మెరుగుపర్చుకుని 60వ స్థానానికి దూసుకెళ్లాడు. మిరాజ్ టెస్టు బౌలర్స్ విభాగంలో కూడా రెండు స్థానాలు మెరుపర్చుకుని 24వ స్థానానికి వెళ్లాడు.