దుబాయ్ : చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటారని వచ్చిన వార్తలపై భారత క్రికెటర్లు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాను వన్డేల నుంచి రిటైర్ అవడం లేదని ట్రోఫీ గెలిచిన తర్వాత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ శర్మ నొక్కి వక్కాణించగా తాజా గా రవీంద్ర జడేజా సైతం స్పందించాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో అతడు స్పందిస్తూ.. ‘అనవసర పుకార్లు వద్దు. ధన్యవాదాలు’ అని రాసుకొచ్చి రిటైర్మెంట్ వార్తలకు చెక్ పెట్టాడు.