రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన
చెన్నై సూపర్ కింగ్స్ 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సీజన్లో ధోనీసేనకు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (2/28) కీలక సమయంలో రెండు వికెట్లు తీయడంతో పాటు ఫీల్డింగ్‌లోనూ నాలుగు కళ్లుచెదిరే క్యాచ్‌లు అందుకొని చెన్నై గెలుపులో ముఖ్యపాత్ర పోషించాడు. ధోనీతో పాటు జడ్డూ బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోయారు. బౌలింగ్, ఫీల్డింగ్‌లో జడేజా మెరిశాడు.
12వ ఓవర్లో జట్టు స్కోరు 87 వద్ద దూకుడుగా ఆడుతున్న జోస్ బట్లర్(49), శివమ్ దూబే (17)లను జడేజా అవుట్ చేశాడు. నాలుగో క్యాచ్ అందుకున్నాక జడ్డూ తనదైన శైలిలో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. స్వీపర్ కవర్లో రాజస్థాన్ బ్యాట్స్‌మన్ జయదేవ్ ఉనద్కత్ క్యాచ్ అందుకున్న తర్వాత తాను పట్టిన క్యాచ్‌ల సంఖ్యను చెప్పడానికి నాలుగు వేళ్లను చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
A resounding victory for @ChennaiIPL against #RR by 45 runs.
— IndianPremierLeague (@IPL) April 19, 2021
4 fine catches and 2 wickets for @imjadeja 👏👏#VIVOIPL pic.twitter.com/xMtP2v2elL
Jadeja's Celebration! Jaddu owns this match.🔥💪#CSKvRR pic.twitter.com/kuxQ0dOzSL
— UrMiL07™ (@urmilpatel30) April 19, 2021