సిడ్నీ: భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లో ఆడేందుకు లైన్ క్లీయర్ అయింది. ఈ చెన్నై దిగ్గజం బీబీఎల్‌లో సిడ్నీ థండర్స్ తరఫున ఆడనున్నట్టు సమాచారం. ఈ వారాంతంలో థండర్స్ జట్టు ఈ మేరకు అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తున్నది.
బీబీఎల్ తర్వాతి సీజన్ డిసెంబర్ 14న మొదలుకానుంది. ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాక అశ్విన్.. దుబాయ్‌లో జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20లోనూ ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం విదితమే. ఐఎల్టీ20 లీగ్ వేలంలోనూ తన పేరును నమోదుచేసుకున్నాడు.