Ravichandran Ashwin | దుబాయ్: భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్నాడు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అశ్విన్ 870 పాయింట్లతో అగ్రస్థానాన్ని అధిష్టించాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చడం ద్వారా అశ్విన్ తన ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నాడు.
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో తొమ్మిది వికెట్లు పడగొట్టిన అశ్విన్..బుమ్రా(847)ను వెనుకకు నెడుతూ నంబర్‌వన్‌లోకి దూసుకొచ్చాడు. హాజిల్‌వుడ్ (847) ప్రస్తుతం రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్‌శర్మ 751 పాయింట్లతో ఐదు ర్యాంక్‌లు మెరుగుపర్చుకుని ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. జైస్వాల్ (740), కోహ్లీ (737) ఎనిమిది, తొమ్మిది ర్యాంక్‌ల్లో ఉన్నారు.