Ravi Shastri : స్వదేశంలో భారత జట్టు టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ కావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. గువాహటి టెస్టు (Guwahati Test)లో కనీసం పోరాడకుండానే టీమిండియా చేతులెత్తేయడాన్ని మాజీలు తప్పుబడుతున్నారు. కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) నేతృత్వంలో భారత జట్టు ప్రదర్శన దిగజారడంపై అందరూ అతడివైపే వేలెత్తి చూపుతున్నారు. ‘ఆటగాళ్లు రాణించకుంటే సుదీర్ఘ ఫార్మాట్లో పూర్వ వైభవం ఇక కల్లేనా’ అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ కోచ్ రవి శాస్త్రి (Ravi Shastri) తదనంతర పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాన్ కోచ్‌గా ఉండి ఉంటే టీమిండియా ఇలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తపడేవాడినని శాస్త్రి అన్నాడు.
సొంతగడ్డపై ఇటీవలే వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసిన భారత జట్టు అనూహ్యగా దక్షిణాఫ్రికా చేతిలో అదే ఫలితాన్ని చవిచూసింది. స్వదేశంలో చెలరేగి ఆడాల్సిన టీమిండియా క్రికెటర్లు ఆడలేక అపసోపాలు పడ్డారు. సిరీస్ సమం చేయాల్సిన గువాహటిలోనూ అంతే దారుణమైన ఆటతో మ్యాచ్‌ను అప్పగించేయడంపై రవి శాస్త్రి మండిపడుతున్నాడు. ‘గువాహటలో ఏం జరిగిందో చూడండి.. వందకు ఒక వికెట్ కోల్పోయిన టీమిండియా.. చూస్తుండగానే 130/7తో ఆలౌట్ అంచున నిలిచింది.
Ravi Shastri opens up about India’s horrific Test series defeat to South Africa at home. 🏏
📸: BCCI/X#oneturfnews #indvsa #teamindia #gautamgambhir #cricket pic.twitter.com/4wJ7OE4iue
— OneTurf News (@oneturf_news) December 2, 2025
అలాఅనీ మన జట్టు మరీ పేలవమైనదేమీ కాదు. ప్రతిభావంతులు లేరని కాదు. కొరవడిందల్లా బాధ్యత మాత్రమే. అవును.. ఆటగాళ్లకు బాధ్యత ఉండాలి. ఎందుకంటే.. మనవాళ్లు దేశవాళీలో.. ఐపీఎల్లో చాలాసార్లు స్పిన్ బౌలర్లను ఎదుర్కొన్నారు. కానీ, ఓపికగా, నిలకడగా ఆడలేక తేలిపోయారు’ అని శాస్త్రి పాడ్‌కాస్ట్‌లో వెల్లడించాడు.
టీమిండియా వైఫల్యంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కోచ్ గౌతం గంభీర్‌ను తాను ఎంతమాత్రం వెనకేసుకురానని చెప్పేశాడు రవి శాస్త్రి. ‘నేను గౌతీకి మద్దతుగా నిలవను. ఎందుకంటే 100 శాతం అతడు బాధ్యత తీసుకోవాలి. ఒకవేళ నేను కోచ్‌గా ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే మొదటగా బాధ్యత తీసుకునేవాడిని. కోచ్‌గా ఎవరైనా చేయాల్సింది అదే. అంతేకాదు ఆటగాళ్లను అలానే వదిలేసేవాళ్లను కాదు. ఈ విషయంలో గంభీర్ అలా చేయలేదు. అందుకని అతడిని నేను వెనకేసుకురాను’ అని మాజీ కోచ్ పేర్కొన్నాడు.
🚨 ANGRY FANS VS GAUTAM GAMBHIR 🚨
Angry Fans chanted – “Gautam Gambhir Resign” in front of Gautam Gambhir after India’s embarrassing Test series loss at Guwahati stadium 😨
– What’s your take 🤔 pic.twitter.com/RaewcDnY1I
— Richard Kettleborough (@RichKettle07) November 26, 2025
కోల్‌కతా టెస్టులో మూడో రోజే 30 పరుగుల తేడాతో ఓటమిపాలైన టీమిండియా.. గువాహటిలో చావుదెబ్బ తిన్నది. నాలుగో రోజు ఆఖర్లో 260-5వద్ద సఫారీ జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. 520కి పైగా లక్ష్య ఛేదనకు దిగిన భారత్ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. స్టార్ ఆటగాళ్లందరూ పెవిలియన్‌కు క్యూ కట్టగా 140కే ఆలౌటైన పంత్ సేన సిరీస్‌ను 0-2తో దక్షిణాఫ్రికాకు సమర్పించుకుంది.