Ravi Sastri on Kohli | టీంఇండియా వన్డే జట్టు సారధిగా విరాట్ కోహ్లీని తప్పించడం సరైన మార్గమే అనిపిస్తున్నదని జట్టు మాజీ చీఫ్ కోస్ట్ రవిశాస్త్రి చెప్పారు. ఇది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు వరం కావచ్చునన్నారు. ఒకే వ్యక్తి మూడు ఫార్మాట్లలో జట్లను నడపడం సవాలే అన్నారు. కొవిడ్ వంటి బయో బబుల్ వంటి విపత్కర పరిస్థితుల్లో సులభం కాదన్నారు. ఇక విరాట్ కోహ్లీ పూర్తిగా టెస్టులపై దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. కోహ్లీ ఇంకా 5,6 ఏండ్ల పాటు ఆడే సత్తా అతడిలో ఉందన్నారు.
విరాట్ కోహ్లీ, తానూ ఒకే విధంగా ఆలోచిస్తామని రవిశాస్త్రి చెప్పారు. కొంచెం దూకుడు స్వభావం, గెలవాలన్న కాంక్షతో ఆడటానికి ప్రయత్నించామని తెలిపారు. గెలుపొందడం కోసం బెరుకు లేకుండా ఆడాలని నిర్ణయించుకున్నట్లు అన్నారు. ఒకవేళ భయం మొదలైతే అది అంటు వ్యాధిలా సోకుతుందన్నారు.