Wimbledon 2023 : వింబుల్డన్ ఫైనల్ పోరులో టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి(Ravi Sharstri) సందడి చేశాడు. ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్ట్‌లో రవి శాస్త్రి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అతడితో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్(Amir Khan,) వింబుల్డన్ ఫైనల్‌ను ప్రత్యక్షంగా వీక్షించాడు. కూతురు ఐరా ఖాన్, కుమారులు జునేద్, ఆజాద్‌తో కలిసి వింబుల్డన్ తుదిపోరును ఆస్వాదించాడు. అమిర్ కుటుంబంతో మ్యాచ్ వీక్షించిన ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ భామ సోనమ్ కపూర్(Sonam Kapoor) కూడా వింబుల్డన్‌లో దర్శనమిచ్చింది. తన భర్త ఆనంద్ అహూజాతో కలిసి సోనమ్ టెన్నిస్ మ్యాచ్‌ను వీక్షించింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. తమ అభిమాన తారలు ఎవరికి సపోర్ట్ చేశారో అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
కార్లోస్ అల్కరాజ్
ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అల్కరాజ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో ర్యాంకర్, అత్యధిక (23) గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్పై ఐదు సెట్లలో కార్లోస్ అల్కరాజ్ విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో అభిమానుల నుంచి అల్కరాజ్‌కే ఎక్కువ మద్దతు లభించగా.. మ్యాచ్ అనంతరం జొకోవిచ్ మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు.