WTA Rankings | అగ్రస్థానం నిలబెట్టుకున్న అల్కరాజ్.. రోహన్ బోపన్నకు ఏడో ర్యాంక్
WTA Rankings : ఈసీజన్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన స్పెయిన్ సంచలనం కార్లో అల్కరాజ్(Carlos Alcaraz).. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న(Rohan Bopanna) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి ఎగబాకాడు. 2013 అక్టోబర్ తర్వాత బోపన్నకు ఇదే అత్యుత్తమ..
WTA Rankings : ఈసీజన్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన స్పెయిన్ సంచలనం కార్లో అల్కరాజ్(Carlos Alcaraz).. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అల్కరాజ్, జొకోవిచ్(Novak Djokovic) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలువగా.. డానియల్ మెద్వెదెవ్, కాస్పెర్ రూడ్, స్టిఫనోస్ సిట్సిపాస్ టాప్-5లో నిలిచారు.
భారత వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న(Rohan Bopanna) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి ఎగబాకాడు. 2013 అక్టోబర్ తర్వాత బోపన్నకు ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. తాజా టోర్నీలో ఆస్ట్రేలియా ప్లేయర్ మాథ్యూ ఎబ్డెన్తో కలిసి సెమీఫైనల్ చేరడం ద్వారా బోపన్న తన ర్యాంక్‌ను మెరుగు పర్చుకున్నాడు.
వొండ్రుసోవాకు అత్యుత్తమ ర్యాంక్
ఇక మహిళల సింగిల్స్ చాంపియన్ మార్కెట వొండ్రుసోవా(Marketa Vondrousova) కెరీర్ అత్యుత్తమ ర్యాంక్‌కు చేరింది. వింబుల్డర్ ఆరంభానికి ముందు మహిళల ర్యాంకింగ్స్‌లో 42వ స్థానంలో ఉన్న ఆమె టాప్-10లో అడుగుపెట్టింది. అన్‌సీడెడ్‌గా లండన్‌లో అడుగుపెట్టిన ఆమె వింబుల్డన్‌లో సంచలనం నమోదు చేసింది.
వింబుల్డన్ ట్రోఫీతో వొండ్రుసోవా

మహిళల సింగిల్స్ ఫైనల్లో వొండ్రుసోవా 6-4, 6-4తో ఓన్స్ జబెర్(ons jabeur)పై గెలుపొందింది. ఇగా స్వియాటెక్ ఫస్ట్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. సబలెంక, రైబాకినా, పెగులా, గార్సియా టాప్-5లో చోటు దక్కించుకున్నారు.
తొలి సెట్ ఓడినా..
టాప్ సీడ్ అల్కరాజ్ వింబుల్డన్ ఫైనల్లో 1-6, 7-6 (8/6), 6-4, 3-6, 6-4తో రెండో సీడ్ జొకోవిచ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో జరిగిన టైటల్ పోరులో తొలి సెట్ ఓడినా సంచలన ఆటతో చాంపియన్‌గా నిలిచాడు. తద్వారా 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గాలనుకున్న జొకోవిచ్ స్వప్నాన్ని అల్కరాజ్ భగ్నం చేశాడు. పవర్ఫుల్ బ్యాక్ హ్యాండ్, సూపర్ నెట్‌గేమ్‌తో ఆకట్టుకున్న ఈ 20 ఏండ్ల నయా సంచలనం వింబుల్డన్‌ను తొలి ర్యాంక్‌తోనే ప్రారంభించాడు.
ఇవి కూడా చదవండి
Ashes Series | యాషెస్ నాలుగో టెస్టు.. సీనియర్ పేసర్ అండర్సన్‌కు పిలుపు
Jasprit Bumrah | బుమ్రా ఫిట్.. ఐర్లాండ్ సిరీస్ జట్టులో యార్కర్ కింగ్..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జాతీయ స్థాయి కథల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని లాస్య
Ramayana | ‘రామాయణ’ ఇంగ్లిష్ వెర్షన్లో 25 నిమిషాలు కట్.. ప్రపంచ ప్రీమియర్‌లో ఆసక్తికర విషయం!
ముద్దం జోగయ్య గౌడ్‌కు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
మేడి అఖిల్ హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
Sabitha Indrareddy | పాలన గాలికొదిలేసి తిరుగుతున్న రేవంత్ రెడ్డి.. మూసీ అంత అర్జెంట్ ఏముంది.. : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

