హైదరాబాద్, ఆట ప్రతినిధి: గురుకుల విద్యార్థి రవికిరణ్.. జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మెరిశాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ టోర్నీలో రవికిరణ్ జావెలిన్ త్రోలో కంచు మోత మోగించాడు.
4వ జాతీయ ఓపెన్ పారా అథ్లెటిక్స్ మీట్లో రవికిరణ్ బరిసెను 21.17 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచాడు. రవికిరణ్‌ను జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ ప్రత్యేకంగా అభినందించారు.