AFG vs SCO : టీ20 వరల్డ్‌కప్ తొలి వామప్ మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్ అదరగొట్టింది. అనూహ్య పరిణామాల మధ్య మెగా టోర్నీలో అడుగుపెట్టిన స్కాట్లాండ్ను చిత్తుగా ఓడించింది. డార్విష్ రసూలీ(84) అర్ధశతకంతో భారీ స్కోర్ చేసిన కాబూలీ టీమ్.. అనంతరం ప్రత్యర్ధిని పక్కా వ్యూహంతో పడగొట్టింది. అజ్మతుల్లా ఒమర్జాయ్(3-14), మొహమ్మద్ నబీ(2-9)లు రాణించడంతో 123కే స్కాంట్లాడ్ కుప్పకూలింది. దాంతో.. రషీద్ ఖాన్ సేన 61 పరుగుల తేడాతో గెలుపొందింది.
భారత్‌లో టీ20 ప్రపంచకప్ సందడి మొదలైంది. మెగా టోర్నీకి ముందు ఆనవాయితీగా జరిగే వామప్ మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్ పంజా విసిరింది. గత సీజన్లో సెమీఫైనల్ ఆడిన రషీద్ ఖాన్ బృందం.. వామప్‌లో భారీ విజయంతో మాతో జాగ్రత్త అనే హెచ్చరికలు పంపింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 1లో డార్విష్ రసూలీ(84) హాఫ్ సెంచరీకి ఓపెనర్ ఇబ్రహీం జడ్రాన్(36), మొహమ్మద్ నబీ(34)ల మెరుపులు తోడవ్వగా అఫ్గన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
🏴 Scotland blown away by Afghanistan in their first warm-up game 🇦🇫
A heavy 61-run defeat, as the Scottish batting couldn’t cope with the Afghan bowling attack.#ScotlandCricket #CricketEverywhere pic.twitter.com/1ujx7T8WzW
— Associate Chronicles (@AssociateChrons) February 2, 2026
బంగ్లాదేశ్‌పై వేటు అనంతరం ర్యాంకింగ్స్ ఆధారంగా వరల్డ్‌కప్ బరిలోకి వచ్చిన స్కాంట్లాండ్ వామప్ మ్యాచ్‌లో నిరాశపరిచింది. అఫ్గనిస్థాన్ నిర్దేశించిన భారీ ఛేదనలో ఓపెనర్ జార్జ్ మున్సీ(13) పవర్ ప్లేలోనే ఔటయ్యాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్(3-14), మొహమ్మద్ నబీ(2-9)లు పోటీపడి వికెట్ల వేటతో విజృంభించగా మైఖేల్ జోన్స్(21), రికీ బెర్రింగ్టన్(9)లు పెవిలియన్ చేరారు. టాపార్డర్ బ్యాటర్ల వైఫల్యంతో 79కే సగం వికెట్లు కోల్పోయిన స్కాంట్లాండ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. మిడిల్, లోయర్ ఆర్డర్‌ను డగౌట్ చేర్చిన ఒమర్జాయ్ అఫ్గనిస్థాన్ విజయంలో కీలకమయ్యాడు.