బెల్ఫాస్ట్: స్టార్ ఆల్‌రౌండర్ రషీద్‌ఖాన్ (10 బంతుల్లో 31 నాటౌట్; ఒక ఫోర్, 3 సిక్సర్లు; 2/21) ఆల్‌రౌండ్ మెరుపులు మెరిపించడంతో ఐర్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో అఫ్గానిస్థాన్ విజయం సాధించింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో అఫ్గాన్ 27 పరుగుల తేడాతో గెలిచింది. మొదట అఫ్గానిస్థాన్ 6 వికెట్లకు 132 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్ (24 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించాడు. లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 11 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. డాక్రెల్ (41 నాటౌట్) టాప్ స్కోరర్ కాగా.. అఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ 3వికెట్లు పడగొట్టాడు.