అహ్మదాబాద్: రషీద్ ఖాన్(Rashid Khan) స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో.. గుజరాత్ ఫీల్డర్ రషీద్ డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. ట్రావిస్ హెడ్ కొట్టిన భారీ షాట్‌కు.. బంతి గాలిలోకి ఎగింది. అయితే ఆఫ్గనిస్తాన్ ఆల్‌రౌండర్ అద్భుతమైన రీతిలో ఆ క్యాచ్‌ను పట్టుకున్నాడు. సుమారు 32 మీటర్ల దూరం పరుగు తీసి.. చివర్లో డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు రషీద్ ఖాన్. డీప్ మిడ్ స్థానంలో ఫీల్డింగ్ చేస్తూ రషీద్ పట్టిన ఆ క్యాచ్ అందర్నీ స్టన్ చేస్తోంది. ఈ యేటి ఐపీఎల్లో ఇదే బెస్ట్ క్యాచ్ అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఆ క్యాచ్‌కు చెందిన వీడియో కూడా వైరల్ అవుతున్నది.
Running backward near the boundary with eyes locked on the ball is no easy task, but Rashid pulled off a stunner with that sensational catch, easily one of the best catch of this season!
— Vipin Tiwari (@Vipintiwari952) May 2, 2025
శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రైజర్స్ 38 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపాలైంది. గుజరాత్ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యఛేదనలో హైదరాబాద్ 20 ఓవర్లలో 186/6 స్కోరుకు పరిమితమైంది. అభిషేక్‌శర్మ(41 బంతుల్లో 74, 4ఫోర్లు, 6సిక్స్‌లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నా లాభం లేకపోయింది. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీశారు.