Rashid Khan : టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాకు షాకిచ్చిన అఫ్గనిస్థాన్(Afghanistan) ఆటగాళ్లు సంబురాల్లో మునిగి తేలుతున్నారు. తమ దేశంలో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు ‘నో’ చెప్పిన ఆసీస్‌ను మెగా టోర్నలో చిత్తుగా ఓడించి పగ తీర్చుకున్నారు. సెమీస్ బెర్తులో కీలకమైన సూపర్ 8లో అద్భుత విజయంపై ఆ జట్టు సారథి రషీద్ ఖాన్(Rashid Khan) పట్టలేనంత సంతోషంతో ఉన్నాడు. అద్భుతాలను నమ్మితే కచ్చితంగా సాధ్యమవుతాయిని చెప్పిన రషీద్.. ఇక తాను హాయిగా నిద్రపోతానని అనుకుంటున్నా అన్నాడు.
‘ఇప్పుడు నేను కంటినిండా నిద్ర పోగలను. కానీ, ఆ ముంబైలో ఆ రాత్రి (నిరుడు వన్డే వరల్డ్ కప్‌లో) మాత్రం నాకు నిద్ర పట్టలేదు. ఆ రోజు మేము 90 శాతం గెలిచే స్థితిలో ఉన్నాం. అప్పుడు మ్యాక్స్‌వెల్ మా నుంచి విజయాన్ని అమాంతం లాగేసుకున్నాడు. ఈరోజు ఈ విజయం మాకెంతో గొప్పది. ఇది ద్వైపాక్షిక సిరీస్ కాదు. వరల్డ్ కప్ టోర్నీ. ఇలాంటి టోర్నీలో పెద్ద జట్లను ఓడించడం నిజంగా పెద్ద అచీవ్మెంట్’ అని రషీద్ ఖాన్ వెల్లడించాడు.
A famous night for Afghanistan🥳#T20WorldCup #AFGvAUS pic.twitter.com/H32KXK4PaG
— ICC (@ICC) June 23, 2024
టీ20 వరల్డ్ కప్‌లో అనూహ్యంగా రాణిస్తున్న అఫ్గనిస్థాన్ (Afghanistan) సంచలన విజయంతో సెమీఫైనల్ బరిలో నిలిచింది. సూపర్ 8 తొలి పోరులో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న కాబూలీ టీమ్ ఆదివారం మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా (Australia)పై సూపర్ విక్టరీ కొట్టింది. దాంతో, గ్రూప్ 1 పాయింట్ల పట్టికలో రషీద్ ఖాన్ (Rashid Khan) నేతృత్వంలోని అఫ్గన్ మూడో స్థానంలో నిలిచింది. దాంతో, సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
తొలుత ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్(60), ఇబ్రహీం జద్రాన్(51)ల మెరుపులతో రషీద్ సేన ఆసీస్‌కు 149 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం గుల్బదిన్ నయీబ్(4/20) విజృంభణతో కంగారు బ్యాటర్లు డగౌట్‌కు క్యూ కట్టారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చరిత్రకెక్కింది. ఎనిమిదో బౌలర్‌గా బంతి అందుకున్న అతడు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్(59) సహా కీలక వికెట్లు తీసి అఫ్గనిస్థాన్ సంచలన విజయంలో భాగమయ్యాడు.